



సుబ్బారావు పేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి.
శనివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం, ఆదివారం మహా అన్న సమారాధన, సోమవారం తిరువీధి ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించబడనున్నాయి. పరిసర మండలాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం పొందుతున్నారు.
ఆలయ ప్రాంగణం పూలతో, పతాకాలతో అలంకరించబడగా, వేదిక వద్ద భజనలు, హోమాలు, సాంప్రదాయ వాద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ఉత్సవాలు సుబ్బారావు పేట గ్రామానికి ప్రత్యేక గౌరవాన్ని తెస్తున్నాయి.
ఈ కార్యక్రమాలకు పరిసర గ్రామాలైన సుబ్బారావుపేట, వాండ్రాడ, చిన్నబమ్మిడి, పెద్దబమ్మిడి, గట్లపాడు, నర్సింగబిల్లి, నిమ్మాడ, నిమ్మాడ జంక్షన్, జడూరు, మహదేవపురం మరియు నిమ్మాడ వారి శ్రీ లలితా జ్యూయలర్స్ వారు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం.

