Sunday, 22 March 2026
  • Home  
  • సుప్రీం కోర్ట్ లో పెండింగ్‌ కేసులు కొండలా పేరుకుపోవడం ఆందోళనకరం
- క్రైమ్

సుప్రీం కోర్ట్ లో పెండింగ్‌ కేసులు కొండలా పేరుకుపోవడం ఆందోళనకరం

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ న్యూ ఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం లో చరిత్రలోనే ఎన్నడూలేనంత అత్యధికంగా 88,417 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయం ఆలస్యం కావడమంటే న్యాయం జరగకపోవడమే అనేది నానుడి. జాతీయ జ్యుడీషియల్‌ గ్రిడ్‌ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం 69,605 సివిల్‌, 18,887 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2020 వేసవి సెలవుల సమయంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రస్తుత సిజెఐ బిఆర్‌ గవారు వేసవి సెలవుల్లోనూ పాక్షికంగా పనిచేసే పద్ధతిని తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న మనదేశంలో సుప్రీంకోర్టుకు 34 మంది న్యాయమూర్తులు సరిపోతారా? అనేది కీలక ప్రశ్న. ఇక హైకోర్టుల్లో 63 లక్షలకుపైగా, దిగువ కోర్టుల్లో దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొల్‌కతా, మహారాష్ట్ర హైకోర్టుల్లో కేసుల పెండింగ్‌ అత్యధికంగా ఉంది. జనాభాతో పోల్చితే న్యాయమూర్తుల నిష్పత్తి ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే… మనదేశంలోనే అత్యంత తక్కువగా ఉండటం కేసుల పెండింగ్‌కు కారణమవుతోంది. అమెరికాలాంటి దేశాల్లో సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 150 మంది వరకూ న్యాయమూర్తులుండగా, మన దేశంలో 21 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. కోర్టుల్లో కేసులు భారీగా పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఇడి, సిబిఐ లాంటి సంస్థలు ప్రతిపక్షాలపై తరచూ అక్రమ కేసులు పెట్టడం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు బుల్‌డోజర్‌ న్యాయం పేరుతో అడ్డగోలుగా వ్యవహరించడం, కొన్నిసార్లు కావాలనే ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడటం… లాంటి చర్యలు న్యాయస్థానాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దేశంలో కార్పొరేట్‌, అవినీతి, నేరగ్రస్థ రాజకీయాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. చట్టసభల సభ్యుల్లో 45 శాతం మందికిపైగా క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాధాన్యతా క్రమంలో చట్ట సభల సభ్యులు, అధికారులపై కేసులను పరిష్కరించడం కూడా అత్యవసరం. ఇక ఇతర కారణాల విషయానికి వస్తే న్యాయవాదులు తరచూ వాయిదాలు కోరడం, స్థానికంగా పరిష్కరించదగినవి కూడా కోర్టులకు తీసుకురావడం, గతంలో సివిల్‌ తగాదాగా ఉన్న చెక్‌బౌన్స్‌ను క్రిమినల్‌ కేసుగా మార్చడం తదితర కారణాల వల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగిపోతున్నాయి. రిటైర్డ్‌ న్యాయమూర్తుల సేవలు సివిల్‌ కేసుల విషయంలో వినియోగించుకుని సుదీర్ఘకాలంగా వాయిదాలున్న కేసుల సంగతి తేల్చాలనే సూచన ఉంది. కోర్టుల్లో తగినంతమంది న్యాయమూర్తులను, సిబ్బందిని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. లోక్‌ అదాలత్‌లు లాంటివి నిర్వహించి ఇరుపక్షాలు అంగీకరించిన కేసులను పరిష్కరిస్తే కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. తీర్పులకు సమయం నిర్దేశించాలనే వాదన కూడా వుంది. న్యాయస్థానాలకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిన కేంద్రం అనేక సందర్భాల్లో అడ్డుపడటం, అడ్డగోలుగా విమర్శలు చేయడం పరిపాటిగా వుంది. న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యేకంగా ఒక జ్యుడీషియల్‌ కమిషన్‌ ఉండాలన్న చర్చ చాలాకాలంగా వుంది. అయితే నేడు కొలీజియం వ్యవస్థ ఆ బాధ్యత నిర్వహిస్తోంది. కాని కేంద్రప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం నియామకాలను తీవ్రంగా జాప్యం చేస్తోంది. ‘పరివార్‌’ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తారని అనుమానం వుంటే ఏవో సాకులు చూపి తిరస్కరిస్తోంది. ఇంకొన్ని సందర్భాల్లో కొలీజియం, కేంద్ర న్యాయశాఖ మధ్య వివాదాస్పదం అవుతున్నవే వున్నాయి. భారత రాజ్యాంగం, పాలన, శాసన, న్యాయవ్యవస్థల మధ్య స్పష్టమైన లక్ష్మణరేఖలను నిర్దేశించింది. పాలకులు వాటిని ఉల్లంఘించిన సందర్భాల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. నాగరిక సమాజంలో సత్వర న్యాయం అందించడం వ్యవస్థ బాధ్యత. అందుకోసం సుప్రీంకోర్టు తీసుకుంటున్న చొరవకు కేంద్రం వీలైనంత తోడ్పాటును అందించాలి. అప్పుడే పెండింగ్‌కు అడ్డుకట్టపడటం తోపాటు సత్వర న్యాయం అందేందుకు అవకాశం ఉంటుంది.

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ న్యూ ఢిల్లీ :
దేశ అత్యున్నత న్యాయస్థానం లో చరిత్రలోనే ఎన్నడూలేనంత అత్యధికంగా 88,417 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయం ఆలస్యం కావడమంటే న్యాయం జరగకపోవడమే అనేది నానుడి. జాతీయ జ్యుడీషియల్‌ గ్రిడ్‌ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం 69,605 సివిల్‌, 18,887 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2020 వేసవి సెలవుల సమయంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రస్తుత సిజెఐ బిఆర్‌ గవారు వేసవి సెలవుల్లోనూ పాక్షికంగా పనిచేసే పద్ధతిని తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న మనదేశంలో సుప్రీంకోర్టుకు 34 మంది న్యాయమూర్తులు సరిపోతారా? అనేది కీలక ప్రశ్న. ఇక హైకోర్టుల్లో 63 లక్షలకుపైగా, దిగువ కోర్టుల్లో దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొల్‌కతా, మహారాష్ట్ర హైకోర్టుల్లో కేసుల పెండింగ్‌ అత్యధికంగా ఉంది. జనాభాతో పోల్చితే న్యాయమూర్తుల నిష్పత్తి ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే… మనదేశంలోనే అత్యంత తక్కువగా ఉండటం కేసుల పెండింగ్‌కు కారణమవుతోంది. అమెరికాలాంటి దేశాల్లో సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 150 మంది వరకూ న్యాయమూర్తులుండగా, మన దేశంలో 21 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు.
కోర్టుల్లో కేసులు భారీగా పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఇడి, సిబిఐ లాంటి సంస్థలు ప్రతిపక్షాలపై తరచూ అక్రమ కేసులు పెట్టడం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు బుల్‌డోజర్‌ న్యాయం పేరుతో అడ్డగోలుగా వ్యవహరించడం, కొన్నిసార్లు కావాలనే ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడటం… లాంటి చర్యలు న్యాయస్థానాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దేశంలో కార్పొరేట్‌, అవినీతి, నేరగ్రస్థ రాజకీయాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. చట్టసభల సభ్యుల్లో 45 శాతం మందికిపైగా క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాధాన్యతా క్రమంలో చట్ట సభల సభ్యులు, అధికారులపై కేసులను పరిష్కరించడం కూడా అత్యవసరం. ఇక ఇతర కారణాల విషయానికి వస్తే న్యాయవాదులు తరచూ వాయిదాలు కోరడం, స్థానికంగా పరిష్కరించదగినవి కూడా కోర్టులకు తీసుకురావడం, గతంలో సివిల్‌ తగాదాగా ఉన్న చెక్‌బౌన్స్‌ను క్రిమినల్‌ కేసుగా మార్చడం తదితర కారణాల వల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగిపోతున్నాయి. రిటైర్డ్‌ న్యాయమూర్తుల సేవలు సివిల్‌ కేసుల విషయంలో వినియోగించుకుని సుదీర్ఘకాలంగా వాయిదాలున్న కేసుల సంగతి తేల్చాలనే సూచన ఉంది. కోర్టుల్లో తగినంతమంది న్యాయమూర్తులను, సిబ్బందిని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. లోక్‌ అదాలత్‌లు లాంటివి నిర్వహించి ఇరుపక్షాలు అంగీకరించిన కేసులను పరిష్కరిస్తే కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. తీర్పులకు సమయం నిర్దేశించాలనే వాదన కూడా వుంది. న్యాయస్థానాలకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిన కేంద్రం అనేక సందర్భాల్లో అడ్డుపడటం, అడ్డగోలుగా విమర్శలు చేయడం పరిపాటిగా వుంది.
న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యేకంగా ఒక జ్యుడీషియల్‌ కమిషన్‌ ఉండాలన్న చర్చ చాలాకాలంగా వుంది. అయితే నేడు కొలీజియం వ్యవస్థ ఆ బాధ్యత నిర్వహిస్తోంది. కాని కేంద్రప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం నియామకాలను తీవ్రంగా జాప్యం చేస్తోంది. ‘పరివార్‌’ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తారని అనుమానం వుంటే ఏవో సాకులు చూపి తిరస్కరిస్తోంది. ఇంకొన్ని సందర్భాల్లో కొలీజియం, కేంద్ర న్యాయశాఖ మధ్య వివాదాస్పదం అవుతున్నవే వున్నాయి. భారత రాజ్యాంగం, పాలన, శాసన, న్యాయవ్యవస్థల మధ్య స్పష్టమైన లక్ష్మణరేఖలను నిర్దేశించింది. పాలకులు వాటిని ఉల్లంఘించిన సందర్భాల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. నాగరిక సమాజంలో సత్వర న్యాయం అందించడం వ్యవస్థ బాధ్యత. అందుకోసం సుప్రీంకోర్టు తీసుకుంటున్న చొరవకు కేంద్రం వీలైనంత తోడ్పాటును అందించాలి. అప్పుడే పెండింగ్‌కు అడ్డుకట్టపడటం తోపాటు సత్వర న్యాయం అందేందుకు అవకాశం ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.