సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రామానాయుడు
రైల్వే కోడూర్ జులై 27 ( పున్నమి న్యూస్)
మంగంపేటలోని పలు నివాసాలను సందర్శించి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకుని, గతంలో అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల స్పందనను తెలుసుకున్నారు.
అనంతరం కోడూరు 20 ఏళ్ల వెనకబాటును తీర్చే ఒక్క అడుగు.. సోమశిల బ్యాక్ వాటర్ ప్రాజెక్టు కోసం మంత్రి రామానాయుడు కి విజ్ఞప్తి.
రైల్వే కోడూరు అభివృద్ధి పథంలోకి రావాలన్న దృఢ సంకల్పంతో,రైతన్నల కష్టాలను తీరుస్తూ… పంట భూములకు సోమశిల బ్యాక్ వాటర్స్ అందేలా చర్యలు తీసుకోవాలని ముక్కా రూపానంద రెడ్డి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కి విజ్ఞప్తి చేశారు.
ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ
“ప్రజల ప్రేమ, ఆదరణే మాకు బలము. ఈ రోజు మీరు ఇచ్చిన గౌరవం మా బాధ్యతను మరింత పెంచింది. ప్రజల మధ్యకి వచ్చి, ప్రతి ఇంటిలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే మా లక్ష్యం అని అన్నారు.
మంత్రివర్యులు రామానాయుడు మాట్లాడుతూ. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది ప్రజలు కూటమి పై చూపుతున్న నమ్మకానికి నిదర్శనం. ప్రజల ఆశయాలను నెరవేర్చడమే మా బాధ్యత. అని పేర్కొన్నారు.


