Tuesday, 24 March 2026
  • Home  
  • సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం
- అన్నమయ్య

సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం

రైల్వే కోడూరు నియోజకవర్గం జూలై 23 (పున్నమి ప్రతినిధి) రైల్వే కోడూరు పట్టణం లక్ష్మీనగర్ ప్రాంతంలో రైల్వే కోడూరు ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం, అభిప్రాయాలు వినడం, ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన పథకాలపై ,భవిష్యత్తులో జరగబోయే అభివృధి పై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంచినీటి సమస్యలు, డ్రైనేజ్, రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రజలు చేసిన ఫిర్యాదులను గమనించారు. సమస్యలపై స్పందిస్తూ, వాటిని తక్షణమే అధికారుల తో మాటాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుపరిపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండటం. నేరుగా ప్రజల వద్దకు వెళ్లడం వల్ల వారికి ఉన్న వాస్తవ సమస్యలు తెలుస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకుంటాం. ఇది ఒక ప్రారంభం మాత్రమే. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి కుటుంబాన్ని కలిసేలా ప్రణాళికతో ముందుకెళ్తాం అని ముక్కా రూపానంద రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, స్థానిక కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీనగర్ ప్రజలు నేతల ప్రత్యక్షంగా ఇంటికొచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

రైల్వే కోడూరు నియోజకవర్గం జూలై 23 (పున్నమి ప్రతినిధి)

రైల్వే కోడూరు పట్టణం లక్ష్మీనగర్ ప్రాంతంలో రైల్వే కోడూరు ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం, అభిప్రాయాలు వినడం, ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన పథకాలపై ,భవిష్యత్తులో జరగబోయే అభివృధి పై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంచినీటి సమస్యలు, డ్రైనేజ్, రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రజలు చేసిన ఫిర్యాదులను గమనించారు. సమస్యలపై స్పందిస్తూ, వాటిని తక్షణమే అధికారుల తో మాటాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సుపరిపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండటం. నేరుగా ప్రజల వద్దకు వెళ్లడం వల్ల వారికి ఉన్న వాస్తవ సమస్యలు తెలుస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకుంటాం. ఇది ఒక ప్రారంభం మాత్రమే. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి కుటుంబాన్ని కలిసేలా ప్రణాళికతో ముందుకెళ్తాం అని ముక్కా రూపానంద రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, స్థానిక కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీనగర్ ప్రజలు నేతల ప్రత్యక్షంగా ఇంటికొచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.