Thursday, 5 February 2026
  • Home  
  • సీ డబ్ల్యూ ఎఫ్‌ ఐ జాతీయ మహాసభలకు రాజస్థాన్ రాష్ట్రం శికర్‌కు బయలుదేరిన తెలంగాణ ప్రతినిధులు
- రాజన్న సిరిసిల్ల

సీ డబ్ల్యూ ఎఫ్‌ ఐ జాతీయ మహాసభలకు రాజస్థాన్ రాష్ట్రం శికర్‌కు బయలుదేరిన తెలంగాణ ప్రతినిధులు

రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీకర్‌లో జరగనున్న జాతీయ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి బయలుదేరారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక హక్కుల పరిరక్షణ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ జాతీయ మహాసభలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డెలిగేట్‌గా జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి పాల్గొనే అవకాశాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: “దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తీవ్రమైన అన్యాయాలకు గురవుతోంది. కార్మిక చట్టాల నిర్వీర్యం, సంక్షేమ పథకాల కోతలు, అసంఘటిత కార్మికుల నిర్లక్ష్యం వంటి సమస్యలపై ఈ జాతీయ మహాసభల్లో బలమైన కార్యాచరణ రూపొందిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికుల సమస్యలను జాతీయ వేదికపై వినిపించేందుకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది” అని తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని, కార్మిక–కర్షక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి

బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీకర్‌లో జరగనున్న జాతీయ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి బయలుదేరారు.
ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక హక్కుల పరిరక్షణ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు.
ఈ జాతీయ మహాసభలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డెలిగేట్‌గా జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి పాల్గొనే అవకాశాన్ని పొందారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
“దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తీవ్రమైన అన్యాయాలకు గురవుతోంది. కార్మిక చట్టాల నిర్వీర్యం, సంక్షేమ పథకాల కోతలు, అసంఘటిత కార్మికుల నిర్లక్ష్యం వంటి సమస్యలపై ఈ జాతీయ మహాసభల్లో బలమైన కార్యాచరణ రూపొందిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికుల సమస్యలను జాతీయ వేదికపై వినిపించేందుకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది” అని తెలిపారు.
ఈ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని, కార్మిక–కర్షక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.