Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

సీపీఆర్‌పై అవగాహనతో ప్రాణాలు కాపాడొచ్చు: డాక్టర్‌ శ్రావణ్‌కుమార్

Punnami Newsroom Published:
సీపీఆర్‌పై అవగాహనతో ప్రాణాలు కాపాడొచ్చు: డాక్టర్‌ శ్రావణ్‌కుమార్

Story highlights

  • ఆత్మకూరు, ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి): అత్యవసర సమయాల్లో సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రిససిటేషన్‌)పై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలని అభిరామ్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ కె.వి.
  • శ్రావణ్‌కుమార్‌ సూచించారు.
  • ఎల్‌ఆర్‌పల్లిలో బుధవారం ఆయన ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఆత్మకూరు, ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి): అత్యవసర సమయాల్లో సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రిససిటేషన్‌)పై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలని అభిరామ్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ కె.వి. శ్రావణ్‌కుమార్‌ సూచించారు. ఎల్‌ఆర్‌పల్లిలో బుధవారం ఆయన ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ గుండెపోటు లేదా ఇతర కారణాలతో వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే స్పందించడం ఎంతో కీలకమన్నారు. అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో పాటు వైద్య సిబ్బంది వచ్చేలోపు సీపీఆర్‌ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని వివరించారు. సీపీఆర్‌ చేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు ప్రత్యక్షంగా వివరించారు.అనంతరం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో స్థానికులకు రక్తపోటు, షుగర్‌ తదితర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్యుల సూచనలు అందించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *