విశాఖపట్నం, అక్టోబర్
విశాఖ నగరంలోని 25వ వార్డు సీతమ్మపేట మెయిన్ రోడ్డులోని శ్రీ దుర్గా గణపతి ఆలయం వద్ద, ఈరోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణు కుమార్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
25వ వార్డు కార్పొరేటర్, జివిఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు సారిపిల్లి గోవింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మొత్తం రూ. 2.80 కోట్లు (రెండు కోట్ల ఎనభై లక్షలు) జివిఎంసి నిధులతో సీసీ డ్రైన్లు, కల్వర్టులు, బీటీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు మరియు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్యామల దీపిక, బీజేపీ నార్త్ ఇన్‌ఛార్జ్ సురేష్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నొడగల కృష్ణ, మాజీ కార్పొరేటర్ ఇసరపు వెంకటలక్ష్మి, బీజేపీ వార్డు అధ్యక్షుడు ఉమాశంకర్, టీడీపీ వార్డు కార్యదర్శి ధనాజీ, అలాగే ఇంజినీరింగ్ అధికారులైన గంగాధర్ (ఈ.ఇ), విజయ్ కుమార్ (డి.ఇ), రాము (ఎ.పి.డి.ఓ), విస్సు (ఎ.ఇ), వర్క్ ఇన్‌స్పెక్టర్ రవి, జోనల్ కమిషనర్ శివప్రసాద్, ఆర్‌పీలు, 25వ వార్డు కూటమి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


