విశాఖపట్టణం: రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేం దుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అమోఘమైందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. విశాఖలో జరిగిన రెండు రోజుల సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కొత్త దిశగా పయనించబోతోందని ఆమె తెలిపారు. సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, నాగుల్ మీరాతో కలిసి ఆమె మాట్లాడారు. సౌమ్య మాట్లాడుతూ— సమ్మిట్‌లో 613 ఒప్పందాలు కుదిరి మొత్తం ₹13.25 లక్షల కోట్లపెట్టుబడులు ప్రకటించబడినట్లు తెలిపారు. వీటి ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగావకాశాలు సృష్టించ బడనున్నాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సులభ వాతావరణం, భౌగోళిక విశిష్టత లను పరిశ్రమాధిపతులు అభి నందిస్తున్నారని వెల్లడించారు.
CRDA, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ తదితర కీలక విభాగాల్లో భారీగా ఒప్పందాలు కుదిరినట్లు ఆమె వివరించారు. ప్రాంతాల వారీగా పెట్టుబడుల పంపిణీపై మాట్లాడిన ఆమె—
రాయలసీమలో రెన్యూవబుల్ మాన్యుఫ్యాక్చరింగ్,
కోస్తాంధ్రలో క్వాంటం, పెట్రో, ఆక్వా, పోర్ట్ ఆధారిత రంగాలు,
ఉత్తరాంధ్ర–విశాఖలో ఐటీ, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని తెలిపారు.
భవిష్యత్తులో ప్రతి నియోజక వర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు స్థాపించి “ఇంటికొక పారిశ్రామికవేత్త” లక్ష్యాన్ని చేరు కునేందుకు ప్రభుత్వం ముంద డుగులు వేస్తోందని ఆమె చెప్పింది. గతంలో జీనోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రధాన పరిశ్రమలను నెలకొల్పి మరోసారి చరిత్ర సృష్టించ బోతున్నారని పేర్కొన్నారు.

సీఐఐ సమ్మిట్‌తో ఏపీకి పెట్టుబడుల వెల్లువ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చుతున్న చంద్రబాబు – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విశాఖపట్టణం: రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేం దుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అమోఘమైందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. విశాఖలో జరిగిన రెండు రోజుల సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కొత్త దిశగా పయనించబోతోందని ఆమె తెలిపారు. సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, నాగుల్ మీరాతో కలిసి ఆమె మాట్లాడారు. సౌమ్య మాట్లాడుతూ— సమ్మిట్‌లో 613 ఒప్పందాలు కుదిరి మొత్తం ₹13.25 లక్షల కోట్లపెట్టుబడులు ప్రకటించబడినట్లు తెలిపారు. వీటి ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగావకాశాలు సృష్టించ బడనున్నాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సులభ వాతావరణం, భౌగోళిక విశిష్టత లను పరిశ్రమాధిపతులు అభి నందిస్తున్నారని వెల్లడించారు. CRDA, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ తదితర కీలక విభాగాల్లో భారీగా ఒప్పందాలు కుదిరినట్లు ఆమె వివరించారు. ప్రాంతాల వారీగా పెట్టుబడుల పంపిణీపై మాట్లాడిన ఆమె— రాయలసీమలో రెన్యూవబుల్ మాన్యుఫ్యాక్చరింగ్, కోస్తాంధ్రలో క్వాంటం, పెట్రో, ఆక్వా, పోర్ట్ ఆధారిత రంగాలు, ఉత్తరాంధ్ర–విశాఖలో ఐటీ, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి నియోజక వర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు స్థాపించి “ఇంటికొక పారిశ్రామికవేత్త” లక్ష్యాన్ని చేరు కునేందుకు ప్రభుత్వం ముంద డుగులు వేస్తోందని ఆమె చెప్పింది. గతంలో జీనోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రధాన పరిశ్రమలను నెలకొల్పి మరోసారి చరిత్ర సృష్టించ బోతున్నారని పేర్కొన్నారు.

