అలంపూర్ : సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదవ రోజు స్కందమాత దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు, తిరుపతి రెడ్డి, కుటుంబ సమేతంగా జోగులాంబ వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని అభిషేకించి అనంతరం హోమంలో పాల్గొన్నారు. తరువాత జోగులాంబ దేవికి కుంకుమార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి ఆలయ అధికారి ప్రసాదాలు అందజేశారు.

సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.
అలంపూర్ : సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదవ రోజు స్కందమాత దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు, తిరుపతి రెడ్డి, కుటుంబ సమేతంగా జోగులాంబ వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని అభిషేకించి అనంతరం హోమంలో పాల్గొన్నారు. తరువాత జోగులాంబ దేవికి కుంకుమార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి ఆలయ అధికారి ప్రసాదాలు అందజేశారు.

