Thursday, 26 March 2026
  • Home  
  • సిరి గోల్డ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు – దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా — ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టం
- ఖమ్మం

సిరి గోల్డ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు – దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా — ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టం

ఖమ్మం, డిసెంబర్ (పున్నమి జిల్లా ప్రతినిధి) సిరి గోల్డ్ సంస్థ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు కావాలని తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిరి గోల్డ్ సంస్థతో తనకు గానీ, తన పెట్టుబడులకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. ఆ సంస్థలో తాను డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే కొంతమంది కావాలని బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, త్వరలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం, డిసెంబర్
(పున్నమి జిల్లా ప్రతినిధి)
సిరి గోల్డ్ సంస్థ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు కావాలని తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సిరి గోల్డ్ సంస్థతో తనకు గానీ, తన పెట్టుబడులకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. ఆ సంస్థలో తాను డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే కొంతమంది కావాలని బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, త్వరలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.