Tuesday, 10 February 2026
  • Home  
  • సిరిసిల్ల 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గెలుపుకోసం జోరుగా ప్రచారం
- రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గెలుపుకోసం జోరుగా ప్రచారం

సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారికి అప్పగించిన బాధ్యతలో భాగంగా 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గారిని గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గారికి ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గజ్జల రాజు ఇతర ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య అతిథులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది నిదర్శనమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారికి అప్పగించిన బాధ్యతలో భాగంగా 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గారిని గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గారికి ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో గజ్జల రాజు ఇతర ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య అతిథులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది నిదర్శనమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.