రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళా రత్న అవార్డు గ్రహీత. చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం రెండు గ్రాముల బంగారం, రెండు గ్రాముల వెండితో ఆకర్షణీయమైన చీరను రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. సుమారు 25 రోజుల పాటు శ్రమించి, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఈ ప్రత్యేక చీరను నేసారు.
హైదరాబాద్ వ్యాపారవేత్త చెన్నారావు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ చీరను మన సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నల్ల విజయ్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని కల్పించిన కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని చెప్పారు. సుమారు రూ.85 వేల వ్యయంతో రూపొందిన ఈ చీర సిరిసిల్ల నేతన్నల ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిందని పలువురు వ్యక్తులను మంత్రముగ్ధుల్ని చేసిందని నల్ల విజయిని అభినందించారు.

