ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ పాత కాలువ నిరుపయోగంగా ఉన్న దానిలో సింగరేణి మట్టి పోయించి అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు.
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ , పార్టీ మండల కార్యదర్శి శ్రీమతి జాజిరి జ్యోతి, మండల కమిటీ సభ్యులు వేపులపాటి కుమారస్వామి, పార్టీ శాఖ కార్యదర్శి బండి వేలాద్రి, అయినంపూడి సనందరావు, కావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

