Thursday, 5 February 2026
  • Home  
  • సినర్జీస్ కుటుంబాల ఆకలి పోరాటం….*
- విశాఖపట్నం

సినర్జీస్ కుటుంబాల ఆకలి పోరాటం….*

*సినర్జీస్ కుటుంబాల ఆకలి పోరాటం….* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* *మా భర్తల కు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి..* *గేటు ముందు పిల్లల తో బైఠాయించిన తల్లులు..* దువ్వాడ VEPZ లో సినర్జీస్ కార్మికుల సమ్మె పోరాటం లో కీలక పరిణామం చోటు చేసుకుంది.. గత 45 రోజులుగా జీతాల బకాయి ల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఈ రోజు బార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు .. సగం నిండిన గంజి అన్నం, కాలీ ప్లేట్లు తో పిల్లల ను తెచ్చి నిరసన తెలిపారు.. పొరుగు జిల్లాల నుండి పదేళ్ల నాడు పొట్ట చేతపట్టుకుని వేస్తే పది నెలలుగా చేసిన పనికి డబ్బులివ్వక పోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసు కున్నారు.. స్కూలు ఫీజులు, ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేని దుస్తితి కి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సమ్మెకు సంఘీభవంగా ఏఐటీయూసీ నేత డాక్టర్ బూసి వెంకట రావు మాట్లాడుతూ కార్మికుల పి ఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వక పోవడం మొండి తనం అన్నారు.. కూటమి పెద్దల అండ ఉందని జె సి ఎల్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎమ్ రాంబాబు, అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి దాసు, వెంకట రావు, రమణ పాల్గొన్నారు

*సినర్జీస్ కుటుంబాల ఆకలి పోరాటం….*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
*మా భర్తల కు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి..*
*గేటు ముందు పిల్లల తో బైఠాయించిన తల్లులు..*
దువ్వాడ VEPZ లో సినర్జీస్ కార్మికుల సమ్మె పోరాటం లో కీలక పరిణామం చోటు చేసుకుంది..
గత 45 రోజులుగా జీతాల బకాయి ల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఈ రోజు బార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు .. సగం నిండిన గంజి అన్నం, కాలీ ప్లేట్లు తో పిల్లల ను తెచ్చి నిరసన తెలిపారు.. పొరుగు జిల్లాల నుండి పదేళ్ల నాడు పొట్ట చేతపట్టుకుని వేస్తే పది నెలలుగా చేసిన పనికి డబ్బులివ్వక పోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసు కున్నారు.. స్కూలు ఫీజులు, ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేని దుస్తితి కి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు..
ఈ సమ్మెకు సంఘీభవంగా ఏఐటీయూసీ నేత డాక్టర్ బూసి వెంకట రావు మాట్లాడుతూ కార్మికుల పి ఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వక పోవడం మొండి తనం అన్నారు.. కూటమి పెద్దల అండ ఉందని జె సి ఎల్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎమ్ రాంబాబు, అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి దాసు, వెంకట రావు, రమణ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.