Tuesday, 24 March 2026
  • Home  
  • సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
- విశాఖపట్నం

సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ పరిశీలనలో తుఫాను కు సంబంధించిన రిపోర్టులను జోన్ వారీగా నిశితంగా పరిశీలించి, ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా నమోదయ్యాయి, నీరు ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో నిలిచి ఉన్నాయి, చెట్లు ఎన్ని విరిగి ఉన్నాయి, ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయబడినవి అనే తదితర అంశాలతో కూడిన రిపోర్టులను పరిశీలించారు. రెండు రోజులు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సహాయక చర్యల కొరకు ప్రజల నుండి ఎక్కువగా ఫిర్యాదులు స్వీకరించేందుకు సిటీ ఆపరేషన్స్ సెంటర్ సిబ్బంది, కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిటీ ఆపరేషన్స్ సెంటర్ నిర్వాహకులకు కమిషనర్ ఆదేశించారు. తుఫాను విపత్తుకు అధికారులు , జోనల్ కమిషనర్లు సిద్ధంగా ఉండాలని , విధులలో ఉన్న వారందరూ తప్పనిసరిగా జాగ్రత్త చర్యల దిశగా రైన్ కోట్లను ఉపయోగించుకోవాలన్నారు.

సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల సిటీ ఆపరేషన్స్ సెంటర్ ను సోమవారం రాత్రి పరిశీలించారు.

ఈ పరిశీలనలో తుఫాను కు సంబంధించిన రిపోర్టులను జోన్ వారీగా నిశితంగా పరిశీలించి, ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా నమోదయ్యాయి, నీరు ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో నిలిచి ఉన్నాయి, చెట్లు ఎన్ని విరిగి ఉన్నాయి, ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయబడినవి అనే తదితర అంశాలతో కూడిన రిపోర్టులను పరిశీలించారు. రెండు రోజులు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సహాయక చర్యల కొరకు ప్రజల నుండి ఎక్కువగా ఫిర్యాదులు స్వీకరించేందుకు సిటీ ఆపరేషన్స్ సెంటర్ సిబ్బంది, కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిటీ ఆపరేషన్స్ సెంటర్ నిర్వాహకులకు కమిషనర్ ఆదేశించారు. తుఫాను విపత్తుకు అధికారులు , జోనల్ కమిషనర్లు సిద్ధంగా ఉండాలని , విధులలో ఉన్న వారందరూ తప్పనిసరిగా జాగ్రత్త చర్యల దిశగా రైన్ కోట్లను ఉపయోగించుకోవాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.