(శ్రీకాకుళం రూరల్) శ్రీకాకుళం నియోజకవర్గంలోని కిష్టప్పపేట గ్రామానికి చెందిన ముద్దాడ చిన్నమ్మడు అనే మహిళకు సిక్కోలు స్వచ్చంధ సేవా సమితి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది.
నెల క్రితం మెడ ఎముక విరిగిపోవడంతో స్థానిక జేమ్స్ హాస్పిటల్‌లో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో చిన్నమ్మడు కన్నవారి ఇంట్లో ఉంటున్నారు. డిగ్రీ చదువుతున్న ఒక కొడుకు ఉన్నారు. తండ్రి ఇటీవలే మృతి చెందడంతో, ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి. మందులు, వైద్యానికి కూడా డబ్బులు సరిగా అందకపోవడంతో కష్టాలు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సిక్కోలు స్వచ్చంధ సేవా సమితి సభ్యులు, సోమవారం ఆమెకు 15 వేల రూపాయల సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బరాటం చంద్రశేఖర్, పరంకుశం జగదీష్, శింతు ఆటకేశం, పొడుగు చరణ్ పాల్గొన్నారు.


