*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్-2025
ప్లీనరీ-20
సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు-2025 రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం 10:00 నుండి 10:45 వరకు “క్లైమేట్ రిస్క్స్ ఫర్ ఇండియన్ బిజినెస్” అంశంపై 20వ ప్లీనరీ హాల్ -5 లో జరిగింది
డా.వెంకట రమణ, CEO, Avera,
India Pvt. Ltd, మోడరేటర్ గా నిర్వహిచిన ఈ ప్లీనరీలో
ఫిలిప్ అస్మస్, CEO, FyrstGen, స్విట్జర్లాండ్, సచిన్ గుప్తా, మేనేజింగ్ పార్ట్నర్, UV Capital Pvt Ltd,
డా. జూలీ రివియర్ – కంట్రీ డైరెక్టర్, GIZ ఇండియా- భూటాన్,
సునీల్ నంబియార్ సింగపూర్
పానల్ సభ్యులుగా పాల్గొన్నారు.
సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బహుళ ధ్రువ వ్యవస్థగా మారుతున్న తరుణంలో, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు భారతీయ వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని పానెల్ సభ్యులు తెలిపారు. వీటి వల్ల ఉత్పాదక కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థలు, అసెట్లు, మార్కెట్లు ప్రభావితమవుతున్నాయని, వరదలు, హీట్ వేవ్ లు, మండుటెండలు, భారీ తుఫానులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయన్నారు. అలాగే విపత్తులు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తూ, కార్మికుల జీవనోపాధులను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ ప్రకృతి విపత్తులను సమర్థవంగా నియంత్రించేందుకు, భారతీయ వ్యాపారాలు తమ బలాలను, బలహీనతలను గుర్తించి, ఎదురైయ్యే ప్రమాదాలను ముందుగా అంచనా వేయాలని సూచించారు. తగిన అప్రమత్తత, సంసిద్దతలతో విపత్తు నివారణ, నియంత్రణ వ్యూహాలను ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో అమలు చేయడం అవసరమని తెలిపారు.
కార్యక్రమంలో సిఐఐ విపత్తుల నియంత్రణపై ప్రచురించిన డిజాస్టర్ రిజీలియన్స్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, బిల్డింగ్ క్లైమేట్ రిజీలియన్స్ ఫర్ ఇండియన్ ఇండస్ట్రీ నివేదికలను ఆవిష్కరించారు


