సిఎస్ తో భేటీ అయిన నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం
అమరావతి, అక్టోబరుపున్నమి ప్రతినిధి:పూర్వోదయ పధకం మరియు విశాఖపట్నం గ్రోత్ హబ్ పై గురువారం ఎపి సచివాలయంలో నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో సమావేశమై చర్చించారు.ఈసందర్భంగా నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రపదేశ్ ముందుందని పూర్వోదయ పధకం ద్వారా తీరప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగాపోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా తగిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు.అదే విధంగా రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న వినూత్న పధకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా తగిన నివేదికను సిద్దం చేసుకోవాలని సిఎస్ విజయానంద్ కు ఆయన సూచించారు.అనంతరం విశాఖపట్నం,అమరావతి,తిరుపతి గ్రోత్ కారిడార్ల ఏర్పాటు తద్వారా జరిగే అభివృద్ధి ప్రయోజనాలపై ఆయన చర్చించారు.
అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ విశాఖపట్నం గ్రోత్ హబ్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించడం జరుగుతుందని చెప్పారు.రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను వేగవతంగా ముందుకు తీసుకువెళ్ళడం తోపాటు అనేక నూతన ప్రాజెక్టులు,పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.కేంద్రం నుండి వివిధ ప్రాజెక్టులు,పధకాలకు సకాలంలో తగిన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయడం జరుగుతోందని కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు అయ్యేలా నీతి ఆయోగ్ సిఫార్సు చేయాలని సిఎస్ విజయానంద్ నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యంకు విజ్ణప్తి చేశారు.
కాగా పూర్వోదయ అనేది దేశ తూర్పతీరంలోని ఆంద్రప్రదేశ్,ఒడిస్సా,పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్,బీహార్ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక వినూత్న పధకం.ఇది సాంస్కృతిక వారసత్వం మరియు సహజ వనరులను ఉపయోగించుకోవడం,కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడం,ఉపాధిని సృష్టించడం మరియు స్థిరమైన ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడం ద్వారా తూర్పు భారతదేశాన్ని జాతీయ పురోగతికి కీలకమైన చోదకంగా మార్చాలనే లక్ష్యంతో పూర్వోదయ పధకాన్ని చేపట్టడం జరిగింది.దీనిద్వారా పెద్దఎత్తున రహదారులు వంతెనలు,విమానాశ్రయాలు,విద్యుత్ ప్లాంట్లు వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది.ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి,పారిశ్రామికాభివృద్ధికి మరింత దోహద చేస్తాయి.అంతేగాక పూర్వోదయ విద్యా మరియు నైపుణ్య-అభివృద్ధి సంస్థలను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది.అర్హత కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి ఐఐటి ఇతర నైపుణ్య-శిక్షణా కేంద్రాల్లో సామర్థ్య విస్తరణ కూడా దోహదపడుతుంది.
పూర్వోదయ పథకం వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు,ఉద్యోగ అవకాశాలు,నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుంది.అంతేగాక పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం తోపాటు పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం, మత్స్య సంపద వంటి రంగాల్లో విలువ జోడింపును ప్రోత్సహిస్తుంది.సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు భారతదేశం అంతటా ఆర్థిక అసమానతలను తగ్గిస్తుంది.మెరుగైన కనెక్టివిటీ మరియు పారిశ్రామిక సామర్థ్యం తూర్పు రాష్ట్రాలను ఎగుమతులు మరియు స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉంచుతాయి.
అదే విధంగా తూర్పు భారతదేశంలో స్థిరమైన అభివృద్ధి వైపు పూర్వోదయ ఒక ముఖ్యమైన ముందడుగా చెప్పవచ్చును.సమానమైన వృద్ధిని సృష్టించడం మరియు తూర్పు భారత దేశాన్ని శక్తివంతమైన ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది.మౌలిక సదుపాయాలు,విద్య మరియు ఆర్థిక సాధికారతలో కొనసాగుతున్న పెట్టుబడులతో 2047 నాటికి వికసిత్ భారత్ అనగా అభివృద్ధి చెందిన భారతదేశంగా మారే ప్రయాణంలో పూర్వోదయ పధకం తూర్పు తీర ప్రాంతంలో ఒక కీలక పాత్ర పోషించనుంది.
ఈసమావేశంలో నీతి ఆయోగ్ అదనపు సిఇఓ పార్ధసారధి రెడ్డి,రాష్ట్ర ఆర్దిక,ప్రణాళికల శాఖల ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్,విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,ఆర్ధికశాఖ కార్యదర్శి వినయ్ చంద్,ప్రణాళికాశాక జెఎస్ అనంత శంకర్,నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి జి.గణేశ్ కుమార్ పాల్గొన్నారు.

సిఎస్ తో భేటీ అయిన నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం
సిఎస్ తో భేటీ అయిన నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం అమరావతి, అక్టోబరుపున్నమి ప్రతినిధి:పూర్వోదయ పధకం మరియు విశాఖపట్నం గ్రోత్ హబ్ పై గురువారం ఎపి సచివాలయంలో నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో సమావేశమై చర్చించారు.ఈసందర్భంగా నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రపదేశ్ ముందుందని పూర్వోదయ పధకం ద్వారా తీరప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగాపోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా తగిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు.అదే విధంగా రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న వినూత్న పధకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా తగిన నివేదికను సిద్దం చేసుకోవాలని సిఎస్ విజయానంద్ కు ఆయన సూచించారు.అనంతరం విశాఖపట్నం,అమరావతి,తిరుపతి గ్రోత్ కారిడార్ల ఏర్పాటు తద్వారా జరిగే అభివృద్ధి ప్రయోజనాలపై ఆయన చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ విశాఖపట్నం గ్రోత్ హబ్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించడం జరుగుతుందని చెప్పారు.రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను వేగవతంగా ముందుకు తీసుకువెళ్ళడం తోపాటు అనేక నూతన ప్రాజెక్టులు,పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.కేంద్రం నుండి వివిధ ప్రాజెక్టులు,పధకాలకు సకాలంలో తగిన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయడం జరుగుతోందని కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు అయ్యేలా నీతి ఆయోగ్ సిఫార్సు చేయాలని సిఎస్ విజయానంద్ నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యంకు విజ్ణప్తి చేశారు. కాగా పూర్వోదయ అనేది దేశ తూర్పతీరంలోని ఆంద్రప్రదేశ్,ఒడిస్సా,పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్,బీహార్ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక వినూత్న పధకం.ఇది సాంస్కృతిక వారసత్వం మరియు సహజ వనరులను ఉపయోగించుకోవడం,కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడం,ఉపాధిని సృష్టించడం మరియు స్థిరమైన ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడం ద్వారా తూర్పు భారతదేశాన్ని జాతీయ పురోగతికి కీలకమైన చోదకంగా మార్చాలనే లక్ష్యంతో పూర్వోదయ పధకాన్ని చేపట్టడం జరిగింది.దీనిద్వారా పెద్దఎత్తున రహదారులు వంతెనలు,విమానాశ్రయాలు,విద్యుత్ ప్లాంట్లు వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది.ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి,పారిశ్రామికాభివృద్ధికి మరింత దోహద చేస్తాయి.అంతేగాక పూర్వోదయ విద్యా మరియు నైపుణ్య-అభివృద్ధి సంస్థలను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది.అర్హత కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి ఐఐటి ఇతర నైపుణ్య-శిక్షణా కేంద్రాల్లో సామర్థ్య విస్తరణ కూడా దోహదపడుతుంది. పూర్వోదయ పథకం వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు,ఉద్యోగ అవకాశాలు,నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుంది.అంతేగాక పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం తోపాటు పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం, మత్స్య సంపద వంటి రంగాల్లో విలువ జోడింపును ప్రోత్సహిస్తుంది.సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు భారతదేశం అంతటా ఆర్థిక అసమానతలను తగ్గిస్తుంది.మెరుగైన కనెక్టివిటీ మరియు పారిశ్రామిక సామర్థ్యం తూర్పు రాష్ట్రాలను ఎగుమతులు మరియు స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉంచుతాయి. అదే విధంగా తూర్పు భారతదేశంలో స్థిరమైన అభివృద్ధి వైపు పూర్వోదయ ఒక ముఖ్యమైన ముందడుగా చెప్పవచ్చును.సమానమైన వృద్ధిని సృష్టించడం మరియు తూర్పు భారత దేశాన్ని శక్తివంతమైన ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది.మౌలిక సదుపాయాలు,విద్య మరియు ఆర్థిక సాధికారతలో కొనసాగుతున్న పెట్టుబడులతో 2047 నాటికి వికసిత్ భారత్ అనగా అభివృద్ధి చెందిన భారతదేశంగా మారే ప్రయాణంలో పూర్వోదయ పధకం తూర్పు తీర ప్రాంతంలో ఒక కీలక పాత్ర పోషించనుంది. ఈసమావేశంలో నీతి ఆయోగ్ అదనపు సిఇఓ పార్ధసారధి రెడ్డి,రాష్ట్ర ఆర్దిక,ప్రణాళికల శాఖల ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్,విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,ఆర్ధికశాఖ కార్యదర్శి వినయ్ చంద్,ప్రణాళికాశాక జెఎస్ అనంత శంకర్,నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి జి.గణేశ్ కుమార్ పాల్గొన్నారు.

