సింహాచలంలో కదం తొక్కిన భవాని భక్తులు
భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పణ
అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్న భక్తులు

సింహాద్రినాధుని పాదాల చెంత అడవివరం గ్రామం ఆయిల్ మిల్ ప్రాంతంలో శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అమ్మవారిని అందంగా తీర్చిదిద్దారు.. అర్చకులు సిహెచ్ రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు 300 మందికి పైగా భక్తులు శిరస్సున బోనాలు ధరించి అడవివరం గ్రామం అంతా ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించారు. సింహాద్రి నాథుడు తొలిపావంచతో పాటు అప్పన్న సోదరీమణులు పైడితల్లమ్మ.. బంగారమ్మ ..ఎల్లమ్మ అమ్మవార్లకు శిరస్సును ధరించిన బోనాలతో దర్శించుకున్నారు అలాగే దుర్గాదేవి అమ్మవారి విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నడిచి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఎర్రటి నిప్పులలో నడుస్తూ తమను చల్లగా కాపాడాలని ఆ దుర్గాదేవిని వేడుకున్నారు .. భోగాపురం నుంచి విచ్చేసిన బృందం అగ్నిగుండం ఏర్పాట్లు చేసింది.. శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ..సింహాచలం దేవస్థానం ధర్మకర్తలు మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు సంఘం సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ గావించారు.. అలాగే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు

