సింహాచలం అప్పన్న స్వామి వారి సన్నిధిలో శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం కళా వేదిక లో ఈ రోజు శ్రీ శివ సాయి కూచిపూడి కళా క్షేత్రం నిర్వాహికురాలు , కళా తపస్వీ శ్రీమతి తణుకు సాయి మాదవి వారిని ఆలయ కమిటి పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు . దుస్సాలువాతో వారి అభిమానాన్ని చాటుకుని మెమోంటోను బహుకరించారు . అనంతరం కళా వేదికపై సాయి మాదవి విద్యార్థిణి చిన్నారి సి హెచ్ ” అభి ” అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసి పలువురుని ఆకర్శించి పెద్దల మన్నలను పొందింది . అభి తో పాటుగా దివ్యాంషి, రత్నశ్రీ , సౌమ్య , హృతిక్, సాయి శ్రీ రామ్ , దినశ్రీ , వేదశ్రీ లక్మి, హారిక , మనస్వి , లాస్య చక్కని నృత్య ప్రదర్శన చేసారు . సాయి మాదవి విద్యార్థిణిలు వారి వారి నృత్య కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు . ఇప్పటికే శ్రీ శివ సాయి కూచిపూడి కళాక్షేత్ర విద్యార్థులు భారతదేశంలో గల అనేక పవిత్ర పుణ్య క్షేత్రాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేసి రాజమంద్రి ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింప చేసారు . చిన్నారుల ప్రదర్శనల అనంతరం సింహాచల పుణ్య క్షేత్ర పెద్దలు చిరంజీవి ” అభి ” కి మొమోంటో జ్ఞాపికతో పాటుగా సర్టిఫికెట్ ను అందచేశారు . అభి తో పాటుగా ప్రతిభను చాటుకున్న మరి కొంతమంది మెమెంటో లు అందుకుని పెద్దల అభినందనలు పొందారు .
ఈ సందర్బంగా కళా తపస్వీ శివ సాయి కళా క్షేత్ర నిర్వహికురాలు తణుకు సాయి మాదవి మాట్లాడుతూ ప్రభుత్వం దృఢ సంకల్పంతో కళలకు వన్నె తెచ్చిన సాహితీ నగరం రాజమంద్రి లో కూచిపూడి కళలను, హిందూ ధర్మ ఔన్నత్యాన్ని ప్రోత్సహించే దిశగా పెద్ద స్థాయిలో ఒక కళా క్షేత్రం ప్రభుత్వం నిర్వహించి కూచిపూడి కళను ప్రోత్సాహించాలని, కూచిపూడి వృద్ధ కాళాకారులకు పెన్షన్ ఇచ్చి గౌరవించాలని , విద్యా సంస్థల్లో కూడా కూచిపూడి విద్య విలువలను , ఔన్నత్యాన్ని తెలియచేసే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించి కూచిపూడి కళను , ఆ చరిత్రను తెలియచేయాల్సిన అవసరం ప్రభుత్వం పై వుందని సాయి మాదవి అభిప్రాన్ని వ్యక్త పరిచారు.


