Saturday, 28 March 2026
  • Home  
  • *సాహో ఫౌండేషన్ వారిచే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ*.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*సాహో ఫౌండేషన్ వారిచే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ*.

*మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)* మర్రిపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న 350 మంది విద్యార్థులకు సాహో ఫౌండేషన్ మర్రిపాడు వారి సహకారంతో ఇంగ్లీషు విషయ నిపుణుడు ఉమామహేశ్వరరావుచే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించబడ్డ ఇంగ్లీషు మెటీరియల్ ను మండల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నిష్ బిట్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత,సాహో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడచల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో 10వ తరగతి ఒక ముఖ్యమైన మైలురాయి అనీ,అత్యుత్తమ మార్కుల సాధన కోసం,విద్యార్థులు కష్టతరంగా భావించే ఇంగ్లీషు విషయానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ను సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించి మండలం లోని అందరు విద్యార్థులకు అందించడం జరిగిందనీ,విద్యార్థులు ఈ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని ఉత్తమ మార్కులు సాధించాలని అన్నారు.మండల విద్యాశాఖ అధికారి-1 తిరుపతయ్య మాట్లాడుతూ మండలంలో విద్యా సంబంధిత కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి-2 ధనలక్ష్మి,కదిరినాయుడు పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్ర,స్టడీ మెటీరియల్ రూపకర్త ఉమామహేశ్వరరావు,రిసోర్స్ పర్సన్ రాజేంద్రకుమార్,మండలంలోని అన్ని పాఠశాలల ఇంగ్లీషు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

*మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)*

మర్రిపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న 350 మంది విద్యార్థులకు సాహో ఫౌండేషన్ మర్రిపాడు వారి సహకారంతో ఇంగ్లీషు విషయ నిపుణుడు ఉమామహేశ్వరరావుచే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించబడ్డ ఇంగ్లీషు మెటీరియల్ ను మండల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నిష్ బిట్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత,సాహో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడచల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో 10వ తరగతి ఒక ముఖ్యమైన మైలురాయి అనీ,అత్యుత్తమ మార్కుల సాధన కోసం,విద్యార్థులు కష్టతరంగా భావించే ఇంగ్లీషు విషయానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ను సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించి మండలం లోని అందరు విద్యార్థులకు అందించడం జరిగిందనీ,విద్యార్థులు ఈ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని ఉత్తమ మార్కులు సాధించాలని అన్నారు.మండల విద్యాశాఖ అధికారి-1 తిరుపతయ్య మాట్లాడుతూ మండలంలో విద్యా సంబంధిత కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి-2 ధనలక్ష్మి,కదిరినాయుడు పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్ర,స్టడీ మెటీరియల్ రూపకర్త ఉమామహేశ్వరరావు,రిసోర్స్ పర్సన్ రాజేంద్రకుమార్,మండలంలోని అన్ని పాఠశాలల ఇంగ్లీషు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.