– మద్దికుంట సర్పంచ్ తాండ్ర మనీషా..
కామారెడ్డి 3 జనవరి (పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ తాండ్ర మనీషా – రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయు లు, అంగన్వాడీ టీచర్లను ఘనంగా సత్కరించారు. సావిత్రిబాయి పూలే స్త్రీ విద్యా కార్యక్రమాలకు చేసిన అమోఘ కృషిని కొనియాడుతూ, ఆమె ఆచరణలను గ్రామీణ మహిళలకు ఆదర్శంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్ర మంలో వార్డు సభ్యులు,పి.ఆర్.టి.యు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాలకిషన్, కృష్ణమోహన్, లక్ష్మణ్, తాండ్ర రామస్వామి, రాములు,వడ్ల కిష్ట య్య, గ్రామ కార్యదర్శి, డ్వాక్రా సంఘ మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి, గ్రామ ప్రజలు, విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు


