తాడపత్రి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
తాడపత్రి పట్టణంలో టిడిపి నాయకులు, వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో సాయి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న ఆశీస్సులతో పాటు టిడిపి సీనియర్ నాయకుడు ఎస్.వి. రవీంద్రారెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్భంగా వాల్మీకి సేవా పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య, పుష్ప నారాయణ రెడ్డి, ఆది రాజేష్, పులి చంద్ర తదితరులు పాల్గొని సాయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు వందలు జరుపుకోవాలని, ప్రజా సేవలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.తాడపత్రి టిడిపి మరియు వాల్మీకి సేవ సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, జై తెలుగుదేశం నినాదాలతో సభను ముగించారు.

