Thursday, 5 February 2026
  • Home  
  • సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో
- విశాఖపట్నం

సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో

సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో ప్రారంభించిన విఎంఆర్డిఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ రమేష్ *విశాఖపట్నం డిసెంబర్ 20 పున్నమి ప్రతినిధి* కొలువుతీరిన అన్ని బ్రాండ్ల కార్లు,బైకులు రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల ఎక్స్ పో సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో 2025 ఘనంగా ప్రారంభమైంది. వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ రమేష్ సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు. రెండు రోజులు పాటు జరిగే ఈ ఈవెంట్ లో సుమారు 20 బ్రాండ్లు కార్లు, బైకుల కంపెనీలు తమ ఉత్పత్తులను వాహన కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. సంవత్సరాంతపు డిస్కౌంట్ సేల్స్ లో భాగంగా పలు మోడల్ కార్లు బైకులు అమ్మకాలు జరిపేందుకు సిద్ధంగా ఉంచారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ శాతాన్ని గణనీయంగా తగ్గించడంతో వాహన కొనుగోలు ప్రియులకు ఊరట లభించింది. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలో గడిచిన 15 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్ పో ఈవెంట్లు మూలంగా ఒకే చోట కంపెనీల ఉత్పత్తులను ఉంచడం వాహన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ముఖ్య గౌరవ అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మారుతి కారు విక్టోరియాస్ ను ఆవిష్కరించారు. అలాగే టీవీఎస్ కంపెనీకి చెందిన రెండు మోడల్ మోటారు బైక్లను లాంచింగ్ చేశారు. శని ఆదివారాల్లో బీచ్ రోడ్ లో విశ్వ ప్రియా ఫంక్షన్ హాల్ ఎదురుగా గల పార్కింగ్ స్థలంలో జరుగుతున్న ఈ ఎక్స్ పోను విశాఖ వాసులు సందర్శించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రణవ్ గోపాల్ కోరారు. కార్యక్రమంలో ఈస్ట్ ఏసిపి కే లక్ష్మణమూర్తి, జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే విజయ మోహన్, హాలిడే వరల్డ్ ప్రతినిధి సిహెచ్ గోపి, ప్రముఖ వ్యాపారవేత్త కూనల కామేష్, రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్, పలు ఆటోమొబైల్ కంపెనీల సీఈవోలు, జిఎంలు, సేల్స్ హెడ్ లు పాల్గొన్నారు.

సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో

ప్రారంభించిన విఎంఆర్డిఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ రమేష్
*విశాఖపట్నం డిసెంబర్ 20 పున్నమి ప్రతినిధి*
కొలువుతీరిన అన్ని బ్రాండ్ల కార్లు,బైకులు

రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల ఎక్స్ పో

సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో 2025 ఘనంగా ప్రారంభమైంది. వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ రమేష్ సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు. రెండు రోజులు పాటు జరిగే ఈ ఈవెంట్ లో సుమారు 20 బ్రాండ్లు కార్లు, బైకుల కంపెనీలు తమ ఉత్పత్తులను వాహన కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. సంవత్సరాంతపు డిస్కౌంట్ సేల్స్ లో భాగంగా పలు మోడల్ కార్లు బైకులు అమ్మకాలు జరిపేందుకు సిద్ధంగా ఉంచారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ శాతాన్ని గణనీయంగా తగ్గించడంతో వాహన కొనుగోలు ప్రియులకు ఊరట లభించింది. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలో గడిచిన 15 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్ పో ఈవెంట్లు మూలంగా ఒకే చోట కంపెనీల ఉత్పత్తులను ఉంచడం వాహన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ముఖ్య గౌరవ అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మారుతి కారు విక్టోరియాస్ ను ఆవిష్కరించారు. అలాగే టీవీఎస్ కంపెనీకి చెందిన రెండు మోడల్ మోటారు బైక్లను లాంచింగ్ చేశారు. శని ఆదివారాల్లో బీచ్ రోడ్ లో విశ్వ ప్రియా ఫంక్షన్ హాల్ ఎదురుగా గల పార్కింగ్ స్థలంలో జరుగుతున్న ఈ ఎక్స్ పోను విశాఖ వాసులు సందర్శించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రణవ్ గోపాల్ కోరారు. కార్యక్రమంలో ఈస్ట్ ఏసిపి కే లక్ష్మణమూర్తి, జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే విజయ మోహన్, హాలిడే వరల్డ్ ప్రతినిధి సిహెచ్ గోపి, ప్రముఖ వ్యాపారవేత్త కూనల కామేష్, రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్, పలు ఆటోమొబైల్ కంపెనీల సీఈవోలు, జిఎంలు, సేల్స్ హెడ్ లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.