Thursday, 5 February 2026
  • Home  
  • సాగ‌ర్ న‌గ‌ర్-1 సచివాల‌య సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ ఘాటు హెచ్చ‌రిక‌
- విశాఖపట్నం

సాగ‌ర్ న‌గ‌ర్-1 సచివాల‌య సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ ఘాటు హెచ్చ‌రిక‌

*వారం రోజుల్లో పురోగ‌తి క‌నిపించ‌కపోతే సస్పెండ్ చేస్తా…* *సాగ‌ర్ న‌గ‌ర్-1 సచివాల‌య సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ ఘాటు హెచ్చ‌రిక‌ *విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి * నిర్దేశించిన ల‌క్ష్యాల మేర‌కు వారం రోజుల్లో పురోగ‌తి క‌నిపించ‌క‌పోతే స‌స్పెండ్ చేయ‌క త‌ప్ప‌ద‌ని స‌చివాల‌య ఉద్యోగుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ హెచ్చ‌రించారు. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సాగ‌ర్ న‌గ‌ర్-1, 2 వార్డు స‌చివాల‌యాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. ప‌లు రికార్డుల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌యం-1లో ప్రభుత్వ ల‌క్ష్యాల మేర‌కు త‌గిన విధంగా పురోగ‌తి లేక‌పోవ‌డాన్ని గ‌మ‌నించిన ఆయ‌న అసంతృప్తి చెందారు. సిటిజ‌న్ స‌ర్వే, ఈ-కేవైసీ చేయ‌టంలో బాగా వెనుక‌బ‌డి ఉన్నార‌ని, ఇంత నిర్ల‌క్ష్యంగా ఉంటే ఎలా అని నిల‌దీశారు. ఇంకా 400 మంది తాలూక‌ ఈ-కేవైసీ పెండింగ్ ఉండ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న వారం రోజుల స‌మయం ఇచ్చారు. ఈ వారం రోజుల్లో పురోగ‌తి క‌నిపించ‌క‌పోతే అత్యంత క‌ఠిన‌ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. రికార్డుల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌పై అప్డేట్ గా ఉండాల‌ని, ఎప్ప‌టి ప‌నే అప్పుడే పూర్తి చేసుకోవాల‌ని సూచించారు. ఆయ‌నతో పాటు స‌చివాల‌యాల జిల్లా కో-ఆర్డినేట‌ర్ ఉషారాణి ఉన్నారు. @అనంత‌రం అదే కాంపౌండ్ లో ఉన్న యూపీహెచ్సీని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ అక్క‌డి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. అందుతున్న వైద్య సేవ‌ల‌పై రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు సామాన్య ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. రోజువారీ ఓపీ, సిబ్బంది హాజ‌రు, ఇత‌ర వివ‌రాల‌పై అక్క‌డ అధికారులను ఆరా తీశారు. ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన రీతిలో మెరుగైన సేవ‌లందించాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు.

*వారం రోజుల్లో పురోగ‌తి క‌నిపించ‌కపోతే సస్పెండ్ చేస్తా…*

*సాగ‌ర్ న‌గ‌ర్-1 సచివాల‌య సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ ఘాటు హెచ్చ‌రిక‌

*విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి * నిర్దేశించిన ల‌క్ష్యాల మేర‌కు వారం రోజుల్లో పురోగ‌తి క‌నిపించ‌క‌పోతే స‌స్పెండ్ చేయ‌క త‌ప్ప‌ద‌ని స‌చివాల‌య ఉద్యోగుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ హెచ్చ‌రించారు. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సాగ‌ర్ న‌గ‌ర్-1, 2 వార్డు స‌చివాల‌యాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. ప‌లు రికార్డుల‌ను ప‌రిశీలించారు. స‌చివాల‌యం-1లో ప్రభుత్వ ల‌క్ష్యాల మేర‌కు త‌గిన విధంగా పురోగ‌తి లేక‌పోవ‌డాన్ని గ‌మ‌నించిన ఆయ‌న అసంతృప్తి చెందారు. సిటిజ‌న్ స‌ర్వే, ఈ-కేవైసీ చేయ‌టంలో బాగా వెనుక‌బ‌డి ఉన్నార‌ని, ఇంత నిర్ల‌క్ష్యంగా ఉంటే ఎలా అని నిల‌దీశారు. ఇంకా 400 మంది తాలూక‌ ఈ-కేవైసీ పెండింగ్ ఉండ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న వారం రోజుల స‌మయం ఇచ్చారు. ఈ వారం రోజుల్లో పురోగ‌తి క‌నిపించ‌క‌పోతే అత్యంత క‌ఠిన‌ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. రికార్డుల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌పై అప్డేట్ గా ఉండాల‌ని, ఎప్ప‌టి ప‌నే అప్పుడే పూర్తి చేసుకోవాల‌ని సూచించారు. ఆయ‌నతో పాటు స‌చివాల‌యాల జిల్లా కో-ఆర్డినేట‌ర్ ఉషారాణి ఉన్నారు.

@అనంత‌రం అదే కాంపౌండ్ లో ఉన్న యూపీహెచ్సీని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ అక్క‌డి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. అందుతున్న వైద్య సేవ‌ల‌పై రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు సామాన్య ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. రోజువారీ ఓపీ, సిబ్బంది హాజ‌రు, ఇత‌ర వివ‌రాల‌పై అక్క‌డ అధికారులను ఆరా తీశారు. ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన రీతిలో మెరుగైన సేవ‌లందించాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.