నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్ నిఘాను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా యస్.పి. డా. అజిత్ వేజెండ్ల తెలిపారు. యస్.పి. ఆదేశాలతో, ఎడిషనల్ యస్.పి. మరియు సంబంధిత డి.ఎస్.పి.ల పర్యవేక్షణలో పట్టణం, శివారు, నిర్మానుష్య ప్రదేశాలలో ఉదయం, సాయంత్రం, రాత్రి నిర్దిష్ట సమయాల్లో డ్రోన్ నిఘా కొనసాగుతోంది.
ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, మద్యం సేవనం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లను కూడా డ్రోన్ ద్వారా గుర్తిస్తున్నారు.
నేరాలకు ఆస్కారం ఉన్న పాడుబడ్డ భవనాలు, తోటలు, పార్కులు, నదీ తీరాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా డయల్ 112 లేదా 1972 కు సమాచారమివ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.


