Thursday, 5 February 2026
  • Home  
  • సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం కే ఆర్ కండ్రిక
- E-పేపర్

సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం కే ఆర్ కండ్రిక

సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం కే ఆర్ కండ్రిక రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు మండలం లో మామిడి రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామిడిలో పూత, పింద దశలలో చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం. కే. ఆర్. కండ్రిక గ్రామం రైల్వే కోడూరు మండలం నందు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడిలో పూత, పిందె దశలో చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల, సస్యరక్షణ చర్యలు పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ జి సందీప్ నాయక్, శాస్త్రవేత్త (తెగుళ్ళ విభాగం) వారు మాట్లాడుతూ మామిడిలో పూత ప్రారంభ దశలో 13-0-45 @ 5 గ్రాములు + యూరియా@ 10 గ్రాములు లీటరు నీటి కలిపి పై పాటుగా పిచికారి చేయడం వలన పూత త్వరగా రావడానికి దోహదపడుతుందని సూచించారు. అలాగే మామిడిలో సూక్ష్మ పోషక మిశ్రమం లేదా అర్క మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మామిడి పిందకట్టే దశలో మరియు కాయలు ఊరేదశలో ఒకసారి పైపాటుగా పిచికారి చేయాలని సూచించారు. మామిడిలో పూత మొదలయ్యే ముందు ఇమిడాక్లోప్రిడ్ @ 0.3 ml + వేప నూనె 1500 ppm@ 5 ml + కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటి కలిపి పైపాటుగా పిచికారి చేయడం వలన పూత ప్రారంభ దశలో ఆశించి తేనె మంచు పురుగు, తామర పురుగు మరియు ఆకుమచ్చ తెగులు ను సమర్థవంతంగా యాజమాన్యం చేయవచ్చని సూచించారు. అంతేగాక మామిడి పంట ఆశించే పండు ఈగను సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవడానికి పండు ఈగను ఆకర్షించే NBAIR, బెంగళూరు రూపొందించిన పండు ఈగ బుట్టలను వినియోగించాలని సూచించారు. సువెన్ అగ్రో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ కొండా రెడ్డి ఆయిల్ పంట ప్రాధాన్యత, ఆవశ్యకత, సాగు చేసే విధానము, ప్రభుత్వం నుండి రైతులకు అందించే సబ్సిడీ వివరించడంతోపాటు ఈ ప్రాంతంలో మామిడికి ఆయిల్ పామ్ పంట ప్రత్యామ్నాయ పంట అని, రైతులు ఎవరైనా ఆయిల్ ఫామ్ సాగుకు ఆసక్తి గలవారు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించవలసిందిగా తెలియజేశారు. భాస్కర్ , ఉద్యాన అధికారి, రైల్వే కోడూరు మండలం వారు మాట్లాడుతూ ఉద్యాన శాఖ తరపున అమలు చేయుచున్న పథకాలు మరియు రాయితీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకులు అంజలి, దినేష్, రూపేష్ నాయక్, హరి ప్రసాద్ మరియు ఉద్యాన రైతులు పాల్గొన్నారు.

సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం కే ఆర్ కండ్రిక

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వే కోడూరు మండలం లో మామిడి రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మామిడిలో పూత, పింద దశలలో చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం. కే. ఆర్. కండ్రిక గ్రామం రైల్వే కోడూరు మండలం నందు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడిలో పూత, పిందె దశలో చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల, సస్యరక్షణ చర్యలు పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ జి సందీప్ నాయక్, శాస్త్రవేత్త (తెగుళ్ళ విభాగం) వారు మాట్లాడుతూ మామిడిలో పూత ప్రారంభ దశలో 13-0-45 @ 5 గ్రాములు + యూరియా@ 10 గ్రాములు లీటరు నీటి కలిపి పై పాటుగా పిచికారి చేయడం వలన పూత త్వరగా రావడానికి దోహదపడుతుందని సూచించారు. అలాగే మామిడిలో సూక్ష్మ పోషక మిశ్రమం లేదా అర్క మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మామిడి పిందకట్టే దశలో మరియు కాయలు ఊరేదశలో ఒకసారి పైపాటుగా పిచికారి చేయాలని సూచించారు. మామిడిలో పూత మొదలయ్యే ముందు ఇమిడాక్లోప్రిడ్ @ 0.3 ml + వేప నూనె 1500 ppm@ 5 ml + కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటి కలిపి పైపాటుగా పిచికారి చేయడం వలన పూత ప్రారంభ దశలో ఆశించి తేనె మంచు పురుగు, తామర పురుగు మరియు ఆకుమచ్చ తెగులు ను సమర్థవంతంగా యాజమాన్యం చేయవచ్చని సూచించారు. అంతేగాక మామిడి పంట ఆశించే పండు ఈగను సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవడానికి పండు ఈగను ఆకర్షించే NBAIR, బెంగళూరు రూపొందించిన పండు ఈగ బుట్టలను వినియోగించాలని సూచించారు. సువెన్ అగ్రో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ కొండా రెడ్డి ఆయిల్ పంట ప్రాధాన్యత, ఆవశ్యకత, సాగు చేసే విధానము, ప్రభుత్వం నుండి రైతులకు అందించే సబ్సిడీ వివరించడంతోపాటు ఈ ప్రాంతంలో మామిడికి ఆయిల్ పామ్ పంట ప్రత్యామ్నాయ పంట అని, రైతులు ఎవరైనా ఆయిల్ ఫామ్ సాగుకు ఆసక్తి గలవారు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించవలసిందిగా తెలియజేశారు. భాస్కర్ , ఉద్యాన అధికారి, రైల్వే కోడూరు మండలం వారు మాట్లాడుతూ ఉద్యాన శాఖ తరపున అమలు చేయుచున్న పథకాలు మరియు రాయితీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకులు అంజలి, దినేష్, రూపేష్ నాయక్, హరి ప్రసాద్ మరియు ఉద్యాన రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.