Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mahabubabad

సర్ ను రద్దు చేయాలి-ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ

Punnami Newsroom Published:
సర్ ను రద్దు చేయాలి-ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ

Story highlights

  • 2025 కి ముందు ఉన్న ఓటర్ జాబితాలను పునరుద్ధరించాలి.* - *జ్ఞానేశ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలి*.
  • - *ఓట్ రద్దు కుట్రకు మోడీ, షా లు బాధ్యత వహించాలి*.
  • *ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేసి 2025 కి ముందు ఉన్న ఓటర్ జాబితాలను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు ఏ.

2025 కి ముందు ఉన్న ఓటర్ జాబితాలను పునరుద్ధరించాలి.*

– *జ్ఞానేశ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలి*.

– *ఓట్ రద్దు కుట్రకు మోడీ, షా లు బాధ్యత వహించాలి*.

*ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేసి 2025 కి ముందు ఉన్న ఓటర్ జాబితాలను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు ఏ. మురళీకృష్ణ, బలాస్టి రమేష్, టి. దేవేందర్ రాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆ సంఘం అధ్యర్వంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో వారు మాట్లాడారు. అధికార బీజేపీ కి అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే ఓటర్ల జాబితాలో ఉంచి ఇతర పార్టీల ఓటర్లను తొలగించే కుట్ర జరిగిందని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు తెలియజేస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ సంస్థల్లో రాజకీయ జోక్యం పెంచి వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయజూస్తుందని ఆరోపించారు. నోట్ రద్దు, నీట్ రద్దు, ఓట్ రద్దు ఇలా అన్ని రద్దులే తప్ప ప్రజలకు కల్పించేది ఏమి లేదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థ కు మూలమైన ఓటును పౌరులకు దూరం చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని, ఈ మొత్తం వ్యవహారానికి మోడీ, అమిత్ షా లు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు*.

*ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిడాల సత్యనారాయణ టి పి టి ఎఫ్ ఫోర్ ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు రిటైర్డ్ సంఘం గౌరవ అధ్యక్షులు మైస నాగయ్య మాజీ ఎంఈఓ పీజీ వివేకానంద యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ కే యాకుబ్ టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ చీకటి ఉపేందర్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ హరి నాయక్ అజ్మీర భీముడు గుడిబోయిన వెంకటేశ్వర్లు బందెల రాజు కే వెంకటేశ్వర్లు వై యాకయ్య బావుసింగ్ ఎస్కే ఇమామ్ ప్రవీణ్ కుమార్ సంజీవ ధైద వెంకటేశ్వర్లు జవహర్లాల్ సంజీవ అక్కెనపల్లి బాబురావు మంగీలాల్ కుమార్ ప్రసాద్ గణపురం బిక్షపతి స రెడ్డి రామలింగారెడ్డి అనుమాండ్ల గోవర్ధన్ చిందం శ్రీనివాస్ నరసింహారావు బాలు తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *