వెంకటాచలం (పున్నమి, డిసెంబర్ 04):–
తిరుమలమ్మపాలెం హై లెవెల్ వంతెన నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకోవడానికి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు.
2018లో ఆనాటి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 9 కోట్లతో వంతెన శిలాఫలకం వేశారు.
2019లో వైసిపి గెలిచిన తర్వాత ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు బొబ్బేపల్లి ఆరోపించారు.
13 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పినా, వంతెన మాత్రం కనిపించడం లేదు…
ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? వంతెన ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు.
తీవ్ర వర్షాల వల్ల తిరుమలమ్మపాలెం రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.
ప్రజల సమస్యలు చూస్తూ ప్రభుత్వం ఎలా మౌనంగా ఉంది? అని బొబ్బేపల్లి మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


