“సర్వేపల్లి వైకాపాలోకి వలసలు”
కాకాణి పూజితమ్మ సమక్షంలో గొలగమూడి ఎంపిటిసి దంపతులు శ్రీమతి మేకల రమణమ్మ భర్త రమణయ్య తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
గొలగమూడి ఎంపిటిసి దంపతులను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన శ్రీమతి కాకాణి పూజిత
కాకాణి పూజిత స్క్రోలింగ్ పాయింట్స్:
- కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.
- ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలకు కూడా కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది.
- చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తుందని ప్రజలు అర్థం చేసుకున్నారు.
- ప్రభుత్వ ఆస్తులను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తుంది.
- పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం చేయాలనే కూటమి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేస్తుంది.
- జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదనే ఆలోచనతోనే, చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది.
- నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వపు రాక్షస పాలన కొనసాగుతుంది.
- కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను పేర్లు మార్చి ప్రజల కు అరకొరగా అందిస్తుంది.
- భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
- కూటమి ప్రభుత్వపు నిర్లక్ష్యం వల్లే ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
- కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుంది.
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజలకు అండగా నిలుస్తుంది.
- చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునేంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది.

