ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మనుబోలు పట్టణంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.

సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – మనుబోలులో రక్తదాన శిబిరం ఏర్పాటు