ఆత్మకూరు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను తక్షణం పునఃప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.“రండి…టీ తాగుతూ మాట్లాడుకుందాం” కార్యక్రమం గురువారం ఆత్మకూర్ పట్టణంలోని మలేరియా కేంద్రం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో తాలూకా సంఘం అధ్యక్షుడు కల్లూరి మస్తానయ్య అధ్యక్షతన ఉద్యోగులు తమ సమస్యలను సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి 35 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని గుర్తుచేశారు. ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే గృహ కల నెరవేరుతుందని సూచించారు. జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప మాట్లాడుతూ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ట్రిబ్యునల్ పునరుద్దరణ అవసరమన్నారు. తాలూకా స్థాయి ఉద్యోగుల అభిప్రాయాలను రాష్ట్ర సంఘం ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తున్నామన్నారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ చర్చలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కాదు, సమస్యలకు సానుకూల పరిష్కారం కాంక్షించి చేపడుతున్నామని వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు నాలుగేళ్లుగా పెన్షన్, ఇతర ప్రయోజనాలు లభించక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాలూకా అధ్యక్షులు కల్లూరి పెద్ద మస్తానయ్య, ముఖ్య కార్యదర్శి సి. చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ పి. ప్రసాదరావు, ధనలక్ష్మి, రవణమ్మ, జాయింట్ సెక్రెటరీ ఎం. జనార్ధన్, ఎం. రసూల్, ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సర్వీసు సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ పునరుజ్జీవనమే మార్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె నాగేంద్రప్ప