సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శం
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
బడుగు, బలహీన వర్గాల వారిని వేధించిన వారిపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శమని వడ్లమాను ఎంపీటీసీ సభ్యులు రాణి మేకల సత్యనారాయణ అన్నారు. మండలంలోని వడ్లమాను లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కుప్పాల నాగరాజు, జలసూత్రం శ్రీనివాసురావు, పామర్తి సత్యనారాయణ, రాణి మేకల వడ్డీలు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శం
సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శం ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి బడుగు, బలహీన వర్గాల వారిని వేధించిన వారిపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శమని వడ్లమాను ఎంపీటీసీ సభ్యులు రాణి మేకల సత్యనారాయణ అన్నారు. మండలంలోని వడ్లమాను లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కుప్పాల నాగరాజు, జలసూత్రం శ్రీనివాసురావు, పామర్తి సత్యనారాయణ, రాణి మేకల వడ్డీలు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

