Tuesday, 10 February 2026
  • Home  
  • సర్పంచులకు సన్మానం గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ప్రత్యేక అధికారి సుజాత
- E-పేపర్

సర్పంచులకు సన్మానం గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ప్రత్యేక అధికారి సుజాత

సర్పంచులకు సన్మానం గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ప్రత్యేక అధికారి సుజాత రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఫిబ్రవరి 10 , పున్నమి న్యూస్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో సర్పంచులకు సోమవారం ప్రత్యేక అధికారి సుజాత ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలు దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని, గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సర్పంచ్ లకు ప్రత్యేక అధికారి సుజాత తెలిపారు. సర్పంచులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైన కుర్రవాని తండా గ్రామం ఆంబోతు చంటి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. త్వరలో సర్పంచ్ లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి 100% హాజరుకావాలని ఎంపీడీవో బాలశంకర్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా శిక్షణ కార్యక్రమానికి రావద్దని మహిళా సర్పంచులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను చేర్పించే విషయంలో నూతన సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామంలో తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మండల విద్యాధికారి రాందాస్ విజ్ఞప్తి చేశారు. ఉల్లాస్ పథకంపై కాసేపు చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు పై సర్పంచులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులు తెలిపారు. సమావేశంలో గ్రామ పంచాయతీలలో తీర్మాన పుస్తకాలు ఎంతమంది సిద్ధం చేశారు అని అడగగా 50 శాతం మంది గ్రామపంచాయతీలో కూడా సిద్ధంగా లేవని తెలిసింది. బండలేమూరు అస్మాత్పూర్ సత్తి తండా గ్రామాలలో ఎంజిఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ డీ.ఈ తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ మార్చి నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని గుర్తు చేశారు. గ్రామపంచాయతీలో నగదు పుస్తకాన్ని మైంటైన్ చేయాలని మండల అభివృద్ధి అధికారి బాలశంకర్ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్లకి పంచాయతీ కార్యదర్శులకు సమన్వయం ముఖ్యమని ఎంపీడీవో చెప్పారు. 15వ ఆర్థిక నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సర్పంచ్లకు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాసిల్దారు ఎం.వి.బి ప్రసాద్, సూపరిన్ టెన్ డెంట్ అబ్దుల్ అజీమ్, వ్యవసాయ అధికారి వెంకటేష్, మండల పంచాయతీ అధికారి ఉమారాణి, ఏ.ఈ మల్లారెడ్డి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

సర్పంచులకు సన్మానం

గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ప్రత్యేక అధికారి సుజాత

రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఫిబ్రవరి 10 , పున్నమి న్యూస్:
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో సర్పంచులకు సోమవారం ప్రత్యేక అధికారి సుజాత ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలు దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని, గ్రామాల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సర్పంచ్ లకు ప్రత్యేక అధికారి సుజాత తెలిపారు. సర్పంచులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైన కుర్రవాని తండా గ్రామం ఆంబోతు చంటి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. త్వరలో సర్పంచ్ లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి 100% హాజరుకావాలని ఎంపీడీవో బాలశంకర్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా శిక్షణ కార్యక్రమానికి రావద్దని మహిళా సర్పంచులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను చేర్పించే విషయంలో నూతన సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామంలో తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మండల విద్యాధికారి రాందాస్ విజ్ఞప్తి చేశారు. ఉల్లాస్ పథకంపై కాసేపు చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు పై సర్పంచులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులు తెలిపారు. సమావేశంలో గ్రామ పంచాయతీలలో తీర్మాన పుస్తకాలు ఎంతమంది సిద్ధం చేశారు అని అడగగా 50 శాతం మంది గ్రామపంచాయతీలో కూడా సిద్ధంగా లేవని తెలిసింది. బండలేమూరు అస్మాత్పూర్ సత్తి తండా గ్రామాలలో ఎంజిఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ డీ.ఈ తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ మార్చి నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని గుర్తు చేశారు. గ్రామపంచాయతీలో నగదు పుస్తకాన్ని మైంటైన్ చేయాలని మండల అభివృద్ధి అధికారి బాలశంకర్ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్లకి పంచాయతీ కార్యదర్శులకు సమన్వయం ముఖ్యమని ఎంపీడీవో చెప్పారు. 15వ ఆర్థిక నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సర్పంచ్లకు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాసిల్దారు ఎం.వి.బి ప్రసాద్, సూపరిన్ టెన్ డెంట్ అబ్దుల్ అజీమ్, వ్యవసాయ అధికారి వెంకటేష్, మండల పంచాయతీ అధికారి ఉమారాణి, ఏ.ఈ మల్లారెడ్డి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.