నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను
దేశభక్తిని, పెంపొందించేందుకు గాను, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ ను నిర్వహించినట్లు,ఎంపీ,రాజ్యసభ సభ్యులు కేసరి దేవ్ సిన్హా జ్వాల తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ ఛార్జ్ గా నియమితులైన ఆయన బుధవారం నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇందులో భాగంగా ఈనెల 31 నుండి నవంబర్ 25 వరకు జిల్లాలలో విడుతలవారీగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను జిల్లా స్థాయిలో నిర్వహించాలని, ప్రతి పాదయాత్ర ఎనిమిది నుండి పది కిలోమీటర్లు ఉండేలా చూడాలని, ఈ పాదయాత్రలో కనీసం 500 మంది యువత,విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఆయన అధికారులను కోరారు.
ఇదే అంశంపై నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎంపీ, రాజ్యసభ సభ్యులు కేసరిదేవ్ సిన్హా జ్వాల, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో సర్దార్ @150 యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని,
విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సర్దార్ @150 యూనిటీ మార్చ్ పై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

సర్దార్ @150 యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపిన : ఎంపీ, రాజ్యసభ సభ్యుడు
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను దేశభక్తిని, పెంపొందించేందుకు గాను, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ ను నిర్వహించినట్లు,ఎంపీ,రాజ్యసభ సభ్యులు కేసరి దేవ్ సిన్హా జ్వాల తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ ఛార్జ్ గా నియమితులైన ఆయన బుధవారం నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇందులో భాగంగా ఈనెల 31 నుండి నవంబర్ 25 వరకు జిల్లాలలో విడుతలవారీగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను జిల్లా స్థాయిలో నిర్వహించాలని, ప్రతి పాదయాత్ర ఎనిమిది నుండి పది కిలోమీటర్లు ఉండేలా చూడాలని, ఈ పాదయాత్రలో కనీసం 500 మంది యువత,విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. ఇదే అంశంపై నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎంపీ, రాజ్యసభ సభ్యులు కేసరిదేవ్ సిన్హా జ్వాల, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో సర్దార్ @150 యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని, విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సర్దార్ @150 యూనిటీ మార్చ్ పై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

