Monday, 23 March 2026
  • Home  
  • సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా
- ఎన్ టి ఆర్ జిల్లా

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా

నందిగామ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగంటి కామేశ్వరరావు ఆధ్వర్యంలో భారత మాజీ గృహశాఖా మంత్రి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 520 సంస్థా నాలుగా విడిపోయిన భారత దేశాన్ని ఏకీకృతం చేసి, సంపూర్ణ స్వతంత్ర భారతదేశంగా రూపుదిద్దిన ఘనత సర్దార్ వల్లభభాయ్ పటేల్‌దేనని గుర్తు చేశారు. హైదరాబాద్, జునాగడ్ వంటి సంస్థానాలను భారతదేశం లో కలిపి జాతీయ ఐక్యతకు మార్గదర్శకుడైన పటేల్ సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పోరుగంటి నరసింహారావు, బండార్ కేదార్నాథ్ శర్మ, తొర్లికొండ సీతారామయ్య, పులిపాటి లక్ష్మణరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, షేక్ సైదా, ఊటుకూరు వెంకట సత్యనారాయణ గుప్తా, తుటారి వెంకటకృష్ణ, ఎర్రగొర్ల లక్ష్మణ్, బోనం రామిరెడ్డి, పింజార కుమారి, రామాచారి, శివనరసింహారావు, ముచ్చింతాల శ్రీనివాసరావు, కేతేపల్లి ప్రసాద్, మాలెపు శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

నందిగామ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగంటి కామేశ్వరరావు ఆధ్వర్యంలో భారత మాజీ గృహశాఖా మంత్రి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 520 సంస్థా నాలుగా విడిపోయిన భారత దేశాన్ని ఏకీకృతం చేసి, సంపూర్ణ స్వతంత్ర భారతదేశంగా రూపుదిద్దిన ఘనత సర్దార్ వల్లభభాయ్ పటేల్‌దేనని గుర్తు చేశారు. హైదరాబాద్, జునాగడ్ వంటి సంస్థానాలను భారతదేశం లో కలిపి జాతీయ ఐక్యతకు మార్గదర్శకుడైన పటేల్ సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పోరుగంటి నరసింహారావు, బండార్ కేదార్నాథ్ శర్మ, తొర్లికొండ సీతారామయ్య, పులిపాటి లక్ష్మణరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, షేక్ సైదా, ఊటుకూరు వెంకట సత్యనారాయణ గుప్తా, తుటారి వెంకటకృష్ణ, ఎర్రగొర్ల లక్ష్మణ్, బోనం రామిరెడ్డి, పింజార కుమారి, రామాచారి, శివనరసింహారావు, ముచ్చింతాల శ్రీనివాసరావు, కేతేపల్లి ప్రసాద్, మాలెపు శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.