Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

సర్టిఫికెట్ కోసం విద్యార్థి అవస్థలు

Punnami Newsroom Published: Updated:
సర్టిఫికెట్ కోసం విద్యార్థి అవస్థలు

Story highlights

  • సీతారామపురం: మండలంలోని మారంరెడ్డిపల్లి సచివాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
  • తనకు అత్యవసరంగా అవసరమైన సర్టిఫికెట్ కోసం పలుమార్లు సచివాలయానికి వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోయాడు.
  • సర్టిఫికెట్ అందకపోవడంతో తన పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపాడు.

సీతారామపురం: మండలంలోని మారంరెడ్డిపల్లి సచివాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు అత్యవసరంగా అవసరమైన సర్టిఫికెట్ కోసం పలుమార్లు సచివాలయానికి వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోయాడు. సర్టిఫికెట్ అందకపోవడంతో తన పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపాడు. ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా అధికారులు అందుబాటులో ఉండాలని కోరాడు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ.. సచివాలయంలో అధికారులు విధులకు సక్రమంగా హాజరై, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *