💐 *సయ్యద్ బాబా సాహెబ్ భౌతికకాయానికి శ్రుద్ధాంజలి ఘటించిన కస్తూరి 💐
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ర్ 16 (పున్నమి న్యూస్ ప్రతినిధి -సింగమాల వెంకటేష్ ) కోడూరు పట్టణంలోని ఒంటెల సిద్ధయ్య నగర్ గ్రామ వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ మైనారిటీ సీనియర్ నాయకులు సయ్యద్ బాబా సాహెబ్ ఈ రోజు అనగా 16.11.2025 వ తేదీన ఆదివారం నాడు స్వర్గస్తులైనందున వారి స్వగృహం నందు వారి పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు.ఈ కార్యక్రమంలో కస్తూరి విశ్వనాధ నాయుడు తో పాటు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయలు, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, ఏపీ గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పులేల రమేష్ బాబు, మాజీ సర్పంచ్ ముక్కర శంకరయ్య, మాజీ ఉపసర్పంచ్ నార్జాల హేమరాజ్, వార్డు మెంబర్ యామల ఈశ్వరయ్య,చాకిరేవు కోన నీటి సంఘం అధ్యక్షులు మద్దిన సుబ్బరాఘవులు నాయుడు, రాజంపేట పార్లమెంట్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు తేనేపల్లి చిన్న,యువ నాయకులు కస్తూరి శివ, మైనారిటీ నాయకులు మౌలా పటాన్, రహీం, కరిముల్లా, సయ్యద్ హుస్సేన్, అక్బర్ తదితర నాయకులు పాల్గొన్నారు.


