డా”బి ఆర్ అంబేద్కర్ కోనసీమ అక్టోబర్ 21
పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ :
అక్టోబర్ 21 — పోలీసు అమరవీరుల దినం — సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర పోలీసు స్ఫూర్తిని స్మరించుకునే రోజు. ప్రపంచమంతా నిద్రలో ఉన్నా, మేల్కొని ప్రజల భద్రతకై కాపలా కాస్తున్న ఒక్క వృత్తి పోలీస్‌దే. ఎండా, వానా, పగలా, రాత్రైనా తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ, కుటుంబ పండుగలను పక్కనబెట్టి ప్రజల కోసం జీవించి, మరణించే వీరులు. కరోనా వంటి విపత్కర కాలాల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పోలీసుల త్యాగం చిరస్మరణీయం. శాంతిభద్రతలు కాపాడుతూ, నేరాలను అరికట్టి, సమాజాన్ని సంరక్షించే వారి సేవలు అపారమైనవి. సైనికులు దేశ సరిహద్దులను కాపాడితే, పోలీసులు సమాజ సరిహద్దులను కాపాడతారు. అలాంటి పోలీసుల కృషిని గౌరవించడం మన అందరి నైతిక బాధ్యత.


