పున్నమి ప్రతి నిధి
సమస్య ల పరిష్కారం దిశగా ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ చేపట్టిన డివిజన్ యాత్ర 3 వ రోజు శుక్రవారం 57 వ డివిజన్ లో కొనసాగింగింది.
ఈ కార్యక్రమం టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. 57వ డివిజన్లోని జగజీవన్ రావు కాలనిలోని సీసీ రోడ్డు ఇరువైపులా డ్రైనేజీ లేకపోవడంతో వర్షాకాలంలో వర్షపు నీటితో అల్లకల్లోలంగా మారిపోతుంది. ఈ సమస్య వల్ల ప్రజలు విషజ్వరాలు, చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోయారు. దీనిపై, బిజెపి నాయకులు కచ్చితంగా పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కన్నేకంటి కృష్ణ చారి, పాశం శ్రీనివాస్ రెడ్డి, భూక్యా వెంకట్, ఉపేంద్ర, నాగమణి, వసంత, కనమర్లపుడి ఉపేందర్ రావు, పద్మావతి, సురేష్ గౌడ్, తోడుపునూరి రవీందర్, దాసరి వీరభద్రం, జిల్లెల్ల నాగరాజు, యుగేందర్, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


