Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

సమస్య మీది.. పరిష్కారం నాది! సాయినగర్, కొత్తూరు, పినమడక గ్రామాల్లో ఇంటింటి ప్రచారం.. ప్రజల సమస్యల పరిష్కారాని

Punnami Newsroom Published:
సమస్య మీది.. పరిష్కారం నాది! సాయినగర్, కొత్తూరు, పినమడక గ్రామాల్లో ఇంటింటి ప్రచారం.. ప్రజల సమస్యల పరిష్కారాని

గాజువాక, అక్టోబర్ 24 (పున్నమి ప్రతినిధి):

జీవీఎంసీ 102వ వార్డులో కూటమి అభ్యర్థి గవర సోమశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం సాయినగర్, కొత్తూరు, పినమడక గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగిన ఆయనకు స్థానికులు పూలు, హారతులతో ఘన స్వాగతం పలికారు.

ప్రజల సమస్యలే నా ప్రాధాన్యం

ఈ సందర్భంగా గవర సోమశేఖర్ మాట్లాడుతూ.. సాయినగర్, కొత్తూరు, పినమడక గ్రామాల ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సొంత సమస్యలుగా భావించి పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. “సమస్య మీది.. పరిష్కారం కోసం కృషి చేసే బాధ్యత నాది” అంటూ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు.

కూటమి నాయకులతో సమన్వయం

టీడీపీ అధ్యక్షుడు కర్రి దశేంద్ర, మాజీ కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, బీజేపీ వార్డు అధ్యక్షుడు కోసూరి తాతారావు మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతూ 102వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సోమశేఖర్ పేర్కొన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి కర్రి అప్పలరాజు, బీజేపీ వార్డు అధ్యక్షుడు కోసూరి తాతారావు, వార్డు టీడీపీ ఉపాధ్యక్షుడు కడవల రమణ, జనసేన నాయకులు మొటూరి రమణ, పాముల వసంత్, మహిళా నాయకురాలు రాజా రత్నం, టీడీపీ మహిళా నాయకులు గీత, గంతకోరు సత్యవతి, టీడీపీ నాయకులు కత్తి తిలక్, బండారు చందు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సమస్య మీది.. పరిష్కారం నాది! సాయినగర్, కొత్తూరు, పినమడక గ్రామాల్లో ఇంటింటి ప్రచారం.. ప్రజల సమస్యల పరిష్కారాని

సమస్య మీది.. పరిష్కారం నాది! సాయినగర్, కొత్తూరు, పినమడక గ్రామాల్లో ఇంటింటి ప్రచారం.. ప్రజల సమస్యల పరిష్కారాని

సమస్య మీది.. పరిష్కారం నాది! సాయినగర్, కొత్తూరు, పినమడక గ్రామాల్లో ఇంటింటి ప్రచారం.. ప్రజల సమస్యల పరిష్కారాని

సమస్య మీది.. పరిష్కారం నాది! సాయినగర్, కొత్తూరు, పినమడక గ్రామాల్లో ఇంటింటి ప్రచారం.. ప్రజల సమస్యల పరిష్కారాని

సమస్య మీది.. పరిష్కారం నాది! సాయినగర్, కొత్తూరు, పినమడక గ్రామాల్లో ఇంటింటి ప్రచారం.. ప్రజల సమస్యల పరిష్కారాని

Leave a comment

Your email address will not be published. Required fields are marked *