నెల్లూరు, (పున్నమి ప్రతినిధి, సి ఎస్ రావు) నెల్లూరు ,జిల్లా పరిషత్ ఆఫీస్ నందు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గారి ఆదేశాల మేరకు ఉద్యోగులకు మరియు పోలీసులకు మధ్య ఏర్పడిన వివాదాలపై చర్చించేందుకు డి ఆర్ ఓ గారు మరియు ఎ. ఎస్. పి గారి సమక్షంలో ఉద్యోగ సంఘ నాయకులు ప్రధానంగా APGEA, APRSA, HAMSA ,APVRA రాష్ట్ర నాయకులు చొప్పా రవీంద్ర బాబు గారు, వరిగొండ. కృష్ణారావు, చేజర్ల సుధాకర్ రావు, పంటా. అశోక్ కుమార్ రెడ్డి ,ఇతర సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జరిగిన చర్చను ఉద్దేశించి APGEA రాష్ట్ర నాయకులు చొప్పా. రవీంద్ర బాబు గారు మాట్లాడుతూ కరోనా కోవిద్ 19 విధుల్లో భాగంగా అత్యవసర సేవలను అందించే డిపార్ట్మెంట్ అధికారులు ,ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీరోచితంగా సేవలు అందిస్తున్నారని, రెట్టింపు స్థాయిలో పోలీసు యంత్రాంగం కూడా సేవలు అందిస్తున్నారని , జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అన్ని శాఖల అధికారులతో కలుపుకొని పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం వంతంగా సేవలు అందించే విధంగా చేస్తున్నారని, కొంతమంది కిందిస్థాయి అధికారులు చేసే తప్పిదాల వల్ల, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని , ఉద్యోగులపై దాడులు చేస్తూ, మానసిక వేదనకు గురి చేయడం సరికాదని ,ఇతర శాఖల ఉద్యోగులను విధి నిర్వహణలో వస్తున్నప్పుడు మాట్లాడే విధానం సరిగా ఉండాలని అని, ఒకరిద్దరు పోలీసు అధికారులు ,ఉద్యోగులు చేసే చర్యల వల్ల , వ్యవస్థ మొత్తానికి ఆపేరు వస్తుందని , డివిజన్ స్థాయి అధికారులు ఆర్డిఓ ,డిఎస్పి గార్లు ఇచ్చిన పాస్ లను పట్టించుకోకుండా జరిమానాలు విధించడం ఎంతవరకు సమంజసమని, ప్రతి పోలీస్ పోస్ట్ దగ్గర ఉద్యోగులును ఎక్కువసేపు ఆపడం వల్ల ,సకాలంలో అత్యవసర సేవలు అందించలేక పోతున్నాం అని విధి నిర్వహణలో వెళ్తున్న వారిని దండించే హక్కు, తిట్టే హక్కు ఎవరిచ్చారని, ఒక ఉద్యోగి తోటి ఉద్యోగిని అకారణంగా కొట్టి చిత్రహింసలు పెట్టడం ఎంతవరకు సమంజసమని, ఇలాంటి పరిస్థితులకు కారకులైన వారిపై చర్యలు తీసుకొని, సమస్యలు పునరావృతం కాకుండా , ఉద్యోగులు అందరూ సృహత్బావ వాతావరణంలో మంచిగా ఉండేటట్లు
చూడాలన్నారు.

నెల్లూరు, (పున్నమి ప్రతినిధి, సి ఎస్ రావు) నెల్లూరు ,జిల్లా పరిషత్ ఆఫీస్ నందు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గారి ఆదేశాల మేరకు ఉద్యోగులకు మరియు పోలీసులకు మధ్య ఏర్పడిన వివాదాలపై చర్చించేందుకు డి ఆర్ ఓ గారు మరియు ఎ. ఎస్. పి గారి సమక్షంలో ఉద్యోగ సంఘ నాయకులు ప్రధానంగా APGEA, APRSA, HAMSA ,APVRA రాష్ట్ర నాయకులు చొప్పా రవీంద్ర బాబు గారు, వరిగొండ. కృష్ణారావు, చేజర్ల సుధాకర్ రావు, పంటా. అశోక్ కుమార్ రెడ్డి ,ఇతర సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జరిగిన చర్చను ఉద్దేశించి APGEA రాష్ట్ర నాయకులు చొప్పా. రవీంద్ర బాబు గారు మాట్లాడుతూ కరోనా కోవిద్ 19 విధుల్లో భాగంగా అత్యవసర సేవలను అందించే డిపార్ట్మెంట్ అధికారులు ,ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీరోచితంగా సేవలు అందిస్తున్నారని, రెట్టింపు స్థాయిలో పోలీసు యంత్రాంగం కూడా సేవలు అందిస్తున్నారని , జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అన్ని శాఖల అధికారులతో కలుపుకొని పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం వంతంగా సేవలు అందించే విధంగా చేస్తున్నారని, కొంతమంది కిందిస్థాయి అధికారులు చేసే తప్పిదాల వల్ల, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని , ఉద్యోగులపై దాడులు చేస్తూ, మానసిక వేదనకు గురి చేయడం సరికాదని ,ఇతర శాఖల ఉద్యోగులను విధి నిర్వహణలో వస్తున్నప్పుడు మాట్లాడే విధానం సరిగా ఉండాలని అని, ఒకరిద్దరు పోలీసు అధికారులు ,ఉద్యోగులు చేసే చర్యల వల్ల , వ్యవస్థ మొత్తానికి ఆపేరు వస్తుందని , డివిజన్ స్థాయి అధికారులు ఆర్డిఓ ,డిఎస్పి గార్లు ఇచ్చిన పాస్ లను పట్టించుకోకుండా జరిమానాలు విధించడం ఎంతవరకు సమంజసమని, ప్రతి పోలీస్ పోస్ట్ దగ్గర ఉద్యోగులును ఎక్కువసేపు ఆపడం వల్ల ,సకాలంలో అత్యవసర సేవలు అందించలేక పోతున్నాం అని విధి నిర్వహణలో వెళ్తున్న వారిని దండించే హక్కు, తిట్టే హక్కు ఎవరిచ్చారని, ఒక ఉద్యోగి తోటి ఉద్యోగిని అకారణంగా కొట్టి చిత్రహింసలు పెట్టడం ఎంతవరకు సమంజసమని, ఇలాంటి పరిస్థితులకు కారకులైన వారిపై చర్యలు తీసుకొని, సమస్యలు పునరావృతం కాకుండా , ఉద్యోగులు అందరూ సృహత్బావ వాతావరణంలో మంచిగా ఉండేటట్లు చూడాలన్నారు.

