(పున్నమి ప్రతినిధి, నెల్లూరు)
ప్రజలు తమ సమస్యలపై స్పందన కార్యక్రమంలో ఇస్తున్న అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్‌బాబు సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే సమస్యలపై ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఫించన్‌లు, ఇళ్ళ పట్టాలు వంటి సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. జగనన్న ఇళ్లకు సంబంధించి పురోగతి వేగంగా ఉండాలన్నారు. ఓటీఎస్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. నగదు చెల్లించిన వారికి సత్వరమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రతి ఇంటికి చెత్త బుట్టలను అందించాలన్నారు. ఈనెల 22న అమలు కానున్న జగనన్న తోడు, పీఎం స్వానిధి పథకాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో జేసీలు హరేందిర ప్రసాద్, గణేష్ కుమార్, జేసీ (ఆసరా) రోజ్‌మాండ్, కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్, హౌసింగ్ పీడీ వేణుగోపాల్‌రావు, ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం తగదు
(పున్నమి ప్రతినిధి, నెల్లూరు) ప్రజలు తమ సమస్యలపై స్పందన కార్యక్రమంలో ఇస్తున్న అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్‌బాబు సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే సమస్యలపై ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఫించన్‌లు, ఇళ్ళ పట్టాలు వంటి సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. జగనన్న ఇళ్లకు సంబంధించి పురోగతి వేగంగా ఉండాలన్నారు. ఓటీఎస్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. నగదు చెల్లించిన వారికి సత్వరమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రతి ఇంటికి చెత్త బుట్టలను అందించాలన్నారు. ఈనెల 22న అమలు కానున్న జగనన్న తోడు, పీఎం స్వానిధి పథకాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో జేసీలు హరేందిర ప్రసాద్, గణేష్ కుమార్, జేసీ (ఆసరా) రోజ్‌మాండ్, కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్, హౌసింగ్ పీడీ వేణుగోపాల్‌రావు, ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.