Sunday, 7 December 2025
  • Home  
  • సమయస్ఫూర్తి
- పిల్లలకు

సమయస్ఫూర్తి

అనగనగా ఒక నైమిశారణ్యం.ఆ అడవిలో ఒక సింహం గాడిద మిగతా జంతువులు ఉండేవి.సింహం అడవికి రాజు.అయితే అది తెలివి తక్కువ సింహం.అది ప్రతిరోజు దొరికిన జంతువులను చంపితినేది.అలా ఒకరోజు ఏనుగునే చంపాలని చూసింది. ఏనుగు ఒక్కసారిగా కాలుపై ఎత్తి సింహం ముందుగా నేలకేసి కొట్టింది అంతే ఆ సింహం గుహలోకి పరిగెత్తింది. ఇక ఆరోజు మొత్తం దానికి ఆహారం లేదు.తర్వాత రోజు ఉదయం ఒక కుందేలును చంపి తినింది.ఆరోజు అలా.. గడిచిపోయింది.ఆరోజు రాత్రి దానికి గాడిద మాంసం తినాలని అనిపించింది అంతే పొద్దున్నే లేచి గాడిద కోసం వెతికసాగింది.ఒక దగ్గర దానికి గాడిద పొదల్లో గడ్డిమేస్తూ కనిపించింది.ఈ తెలివి తక్కువ సింహం ఎగిరి దూకి చంపకుండా గాడిద దగ్గరకు వెళ్లి గాడిద గాడిద నేను నిన్ను తినొచ్చా అని అడిగింది.కానీ ఒక్క షరతు నువ్వు పరిగెత్త కూడదు అని చెప్పింది సింహం.మహారాజా మీరు నన్ను తినాలి అంటే నాది కూడా ఒకసారి షరత్తు అని చెప్పింది గాడిద.సింహం దానికి సరే త్వరగా చెప్పు అని చెప్పింది.మనిద్దరిలో ఎవరు శక్తివంతులో నాకు తెలుసుకోవాలని ఉంది అనింది గాడిద.దాంట్లో సందేహం ఏముంది నేను శక్తివంతుడిని అని తటపటాయించకుండా చెప్పింది సింహం.అలా ఎలా చెప్తారు మహారాజా మనం ఒక పోటీ పెట్టుకుందాం అని చెప్పింది గాడిద.ఇదిగోండి ఇక్కడ ఒక గోడ ఉంది కదా దానిని ఎవరు పడగొడితే వారే శక్తివంతులు అని చెప్పింది గాడిద.దానికి సింహం కూడా సరేంది.గాడిద ముందు సింహానికి అవకాశం ఇచ్చింది.సింహం వెళ్లి ఆ గోడని గోళ్ళతో గీకి,గీకి తన వల్ల కాక వచ్చేసింది.గాడిద వంతు వచ్చేసరికి గాడిద పరిగెత్తుకుంటూ వెళ్లి తన వెనక రెండు కాళ్ళు ఎత్తి గట్టిగా ఒక్క తన్ను తన్నింది అంతే ఆ గోడ దబెల్ మని కిందపడిపోయింది.అప్పుడు సింహం ఇది నాకంటే శక్తివంతమైనది గా ఉంది నేను ఇప్పుడు దానికి దొరికాను అంటే నన్ను చంపేస్తుంది అని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది సింహం.గాడిద తప్పించుకుందనుకొని గట్టిగా ఊపిరి పిల్చుకొని సంతోషంతో ఎగిరి గంతేసింది. నీతి:సమయస్ఫూర్తితో ఏ ఆపదనుండైనా బయటపడవచ్చు

అనగనగా ఒక నైమిశారణ్యం.ఆ అడవిలో ఒక సింహం గాడిద మిగతా జంతువులు ఉండేవి.సింహం అడవికి రాజు.అయితే అది తెలివి తక్కువ సింహం.అది ప్రతిరోజు దొరికిన జంతువులను చంపితినేది.అలా ఒకరోజు ఏనుగునే చంపాలని చూసింది. ఏనుగు ఒక్కసారిగా కాలుపై ఎత్తి సింహం ముందుగా నేలకేసి కొట్టింది అంతే ఆ సింహం గుహలోకి పరిగెత్తింది. ఇక ఆరోజు మొత్తం దానికి ఆహారం లేదు.తర్వాత రోజు ఉదయం ఒక కుందేలును చంపి తినింది.ఆరోజు అలా.. గడిచిపోయింది.ఆరోజు రాత్రి దానికి గాడిద మాంసం తినాలని అనిపించింది అంతే పొద్దున్నే లేచి గాడిద కోసం వెతికసాగింది.ఒక దగ్గర దానికి గాడిద పొదల్లో గడ్డిమేస్తూ కనిపించింది.ఈ తెలివి తక్కువ సింహం ఎగిరి దూకి చంపకుండా గాడిద దగ్గరకు
వెళ్లి గాడిద గాడిద నేను నిన్ను తినొచ్చా అని అడిగింది.కానీ ఒక్క షరతు నువ్వు పరిగెత్త కూడదు అని చెప్పింది సింహం.మహారాజా మీరు నన్ను తినాలి అంటే నాది కూడా ఒకసారి షరత్తు అని చెప్పింది గాడిద.సింహం దానికి సరే త్వరగా చెప్పు అని చెప్పింది.మనిద్దరిలో ఎవరు శక్తివంతులో నాకు తెలుసుకోవాలని ఉంది అనింది గాడిద.దాంట్లో సందేహం ఏముంది నేను శక్తివంతుడిని అని తటపటాయించకుండా చెప్పింది సింహం.అలా ఎలా చెప్తారు మహారాజా మనం ఒక పోటీ పెట్టుకుందాం అని చెప్పింది గాడిద.ఇదిగోండి ఇక్కడ ఒక గోడ ఉంది కదా దానిని ఎవరు పడగొడితే వారే శక్తివంతులు అని చెప్పింది గాడిద.దానికి సింహం కూడా సరేంది.గాడిద ముందు సింహానికి అవకాశం ఇచ్చింది.సింహం వెళ్లి ఆ గోడని గోళ్ళతో గీకి,గీకి తన వల్ల కాక వచ్చేసింది.గాడిద వంతు వచ్చేసరికి గాడిద పరిగెత్తుకుంటూ వెళ్లి తన వెనక రెండు కాళ్ళు ఎత్తి గట్టిగా ఒక్క తన్ను తన్నింది అంతే ఆ గోడ దబెల్ మని కిందపడిపోయింది.అప్పుడు సింహం ఇది నాకంటే శక్తివంతమైనది గా ఉంది నేను ఇప్పుడు దానికి దొరికాను అంటే నన్ను చంపేస్తుంది అని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది సింహం.గాడిద తప్పించుకుందనుకొని గట్టిగా ఊపిరి పిల్చుకొని సంతోషంతో ఎగిరి గంతేసింది.

నీతి:సమయస్ఫూర్తితో ఏ ఆపదనుండైనా బయటపడవచ్చు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.