విశాఖ సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు విజయవంతం కావాలని జాయింట్ సెక్రటరీ సరితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ సూచించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఇతర అధికారులతో కలసి విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో నోవాటెల్ హోటల్‌లో జరగనున్న సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. రిజిస్ట్రేషన్ సులభతరం చేయాలని, కౌంటర్లు పెంచాలని, ఆన్లైన్ లింక్ ద్వారా నమోదు కల్పించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, లైజన్ అధికారుల బాధ్యతలను స్పష్టంగా వివరించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల వద్ద అతిథులను స్వాగతించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సదస్సు ప్రతిష్టాత్మకంగా జరుగాలని, అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.


