संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

సత్య దుర్గామాతను కుటుంబ సమేతంగా దర్శించుకున్న GDR ట్రస్ట్ చేర్మెన్. డా. అనిల్ కుమార్,దంపతులు.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సత్య దుర్గామాతను కుటుంబ సమేతంగా దర్శించుకున్న GDR ట్రస్ట్ చేర్మెన్. డా. అనిల్ కుమార్,దంపతులు.

కుబీర్ మండలం,సిరిపెల్లి హెచ్:పున్నమి ప్రతినిధి : గ్రామంలో కొలువుదీరిన శ్రీ సత్య దుర్గామాత (మహా ప్రసన్న జగత్ జనని జగదీశ్వరి దేవి) అమ్మవారిని ప్రముఖ వైద్యులు, జీడీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డా. అనిల్ కుమార్ జాదవ్, డా. దీప అనిల్ కుమార్ జాదవ్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో బాలాజీ పాటిల్ (టీచర్), ఆనంద్ రావు పాటిల్ PRO సాయినాథ్ గ్రామ సర్పంచ్ సతీష్.గారు ,గ్రామ పెద్దలు.మాతా భక్తులు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సత్య దుర్గామాత అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ దర్శన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.

సత్య దుర్గామాతను కుటుంబ సమేతంగా దర్శించుకున్న GDR ట్రస్ట్ చేర్మెన్. డా. అనిల్ కుమార్,దంపతులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *