భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను సత్యవేడు పట్టణంలో మండల అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో మూడు రోడ్ల కూడలి వద్ద భారీ కేకును ఏర్పాటు చేసి బిజెపి పార్టీ మండల నాయకులు కార్యకర్తలు మధ్యన నరేంద్ర మోడీని కొనియాడుతూ టపాసులు పేల్చి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ భారత దేశ భవితను మార్చిన ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కె దక్కుతుందని భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రపంచంలోనే జిడిపి మూడవ స్థానాన్ని చేరుకునే విధంగా ఆయన కృషి చేస్తున్నారని తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో ముందుకు దూసుకెళుతున్నదని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గించడం, భారతదేశ మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, చిన్న మధ్యతరగతి పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు యువతను ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో సుమారు 21 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఇది ఏ ఒక్క రాష్ట్రానికి కాదు మొత్తం 29 రాష్ట్రాలకు సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేస్తున్న ఈ ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కె ఘనత దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు బండారు మోహన్ బాబు నెల్లూరు వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి నరేంద్ర రెడ్డి శ్రీకాంత్ కుమార్, కార్యదర్శులు రవి, రాజా శెట్టి, యువ మోర్చా పార్థసారథి, గిరిధర్, సోషల్ మీడియా భువనేష్ తదితరులు ఉన్నారు


