సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @
AP: బాలికల అదృశ్యం కేసులను ఛేదించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ చేపట్టిన ‘ఆపరేషన్ ట్రేస్’ సత్ఫలితాలిచ్చింది.
ఈ కార్యక్రమంలో భాగంగా నెలరోజుల్లో 670కేసులు ఛేదించగలిగారు.
తప్పిపోయిన, అపహరణకు గురైన బాలికల ఆచూకీ కనిపెట్టి వారి కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు.
జులై 31 నాటికి ఈ తరహా 1,065కేసులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించిన DGPహరీష్కుమార్ గుప్తా… వారి ఆచూకీ కనిపెట్టేందుకు ఆగస్టు నెలంతా ‘ఆపరేషన్ ట్రేస్’ పేరిట స్పెషల్స్టవ్ చేపట్టారు.


