పున్నమి ప్రతినిధి
సత్తుపల్లి పట్టణ బిజెపి అధ్యక్షుడు బానోతు విజయ్ పై కాంగ్రెస్ గుండాలు చేసిన అమానుష దాడిని బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్మార్గ దాడికి కారణమైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ గారికి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు హింసాత్మక దాడుల రూపంలో ప్రదర్శించడం అంగీకారయోగ్యం కాదని ఉపేందర్ గౌడ్ గారు హెచ్చరించారు. బిజెపి కార్యకర్తలపై దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆయన పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.


