పున్నమి ప్రతి నిధి
సత్తుపల్లి పట్టణంలో ఆనందోత్సాహాల నడుమ జరిగిన వివాహ వేడుకలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టణానికి చెందిన బాణోత్ రాములు – కృష్ణవేణి దంపతుల కుమారుడు కార్తీక్ సాయి – తేజస్విని వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఆదివారం నాడు సండ్ర వెంకట వీరయ్య దంపతుల నివాసానికి వెళ్లి నూతన వధూవరులను స్వయంగా అభినందించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, యువ దంపతులు సుఖసంతోషాలతో, సాఫల్యమయ జీవితాన్ని గడపాలని ఆశీర్వదించారు. వివాహం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని, పరస్పర విశ్వాసం, గౌరవం, ప్రేమతో దాంపత్య జీవితం సుసంపన్నంగా సాగుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మాజీ గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, షేక్ రఫీ, మల్లూరు అంకంరాజు, చాంద్ పాషా, పర్వతనేని వేణు, గుండ్ర రఘు, జొన్నలగడ్డ కృష్ణ, కోట రాజకుమార్ తదితర బిఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సండ్ర వెంకట వీరయ్య గారిని స్వాగతించి కృతజ్ఞతలు తెలిపారు. సత్తుపల్లి పట్టణంలో ఈ వివాహ వేడుక శుభ వాతావరణంలో సంతోషంగా జరిగింది.


